బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది.ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది.తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమాకి ‘స్కంద’ అనే పేరును ఖరారు చేశారు.
![రామ్, బోయపాటి పాన్ ఇండియా మూవీకి టైటిల్ ఫిక్స్ ... 2 బోయపాటి, బోయపాటి పాన్ ఇండియా మూవీకి టైటిల్ ఫిక్స్ ...](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-03T135536.645.jpg)
‘ది అటాకర్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ మేరకు టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారులో రామ్ మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. తప్పకుండా ఇది జనంలోకి దూసుకుపోయేలా ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు అని తెలుస్తుంది. ఈ వీడియోలో రామ్ గెటప్ అదిరిపోయింది.
గుబురు గడ్డంతో న్యూ లుక్ లో ఆకట్టుకున్నాడు రామ్.ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదిరిపోయే టైటిల్ గింప్స్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ దెబ్బతో రామ్ కెరీర్లో మరో ఊరమాస్ హిట్ పడటం ఖాయమని భావిస్తున్నారు. స్కంద’ చిత్రం పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతోంది శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు.