కరోనా లాక్ డౌన్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా సినిమాలు అన్ని థియేటర్స్ కి క్యూ కడుతున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి కొంత మంది దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మరికొంత మంది ఓటీటీ ఛానల్స్ నుంచి మంచి ప్యాకేజీ తీసుకొని డిజిటల్ రిలీజ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఏది ఏమైనా సినిమా సందడి మాత్రం రాబోయే వారం గట్టిగా ఉండబోతుంది . ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ ఇయర్ లో గట్టిగా చూసుకుంటే రిలీజ్ అయినా అన్ని సినిమాలలో ఒక అరడజను సినిమాలు మాత్రమే హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. మిగిలినవి ఫ్లాప్ అయ్యాయి. ఓటీటీలో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు కూడా బాగానే మెప్పించాయి.
ఈ నెలలో బింబిసారా, కార్తికేయ 2, సీతారామం సినిమాలతో టాలీవుడ్ హ్యాట్రిక్ హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. ఇక రాబోయే వారంలో కాస్తా బజ్ ఉన్న సినిమాలు చూసుకుంటే చియాన్ విక్రమ్ కోబ్రా మూవీకి మంచి హైప్ ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇక తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన రంగరంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఫీల్ గుడ్ ఫామిలీ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మీద కూడా కొంత బజ్ ఉంది. ఇక జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కథతో రాబోతున్న ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీకి కూడా కొంత హైప్ ఉంది.
ఈ సినిమా కూడా సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. ఇక వీటితో పాటు సునీల్, ధనరాజ్ కాంబోలో వస్తున్న బుజ్జి ఇలా రా, రామ్మోహన్ కుంచుకోమల, నావెంట పడుతున్న చిన్నవాడెవడమ్మ, ఆకాశ వీధుల్లో, డైహార్డ్ ఫ్యాన్ సినిమాలు సెప్టెంబర్2న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటీటీలో పెళ్లికూతురు పార్టీ, పంచతంత్ర కథలు సెప్టెంబర్31న ఆహాలో, మై డియర్ భూతం, విక్రాంత్ రానా డబ్బింగ్ సినిమాలు సెప్టెంబర్ 2న జీ5లో, చిత్తం మహారాణి ఆహాలో రిలీజ్ కాబోతున్నాయి. మరి వీటిలో ఎన్ని సినిమాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి అనేది చూడాలి.