తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన జరిగింది. కోడా కోలా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న యువ నటుడు హరికాంత్ (33) కన్నుమూశారు. శనివారం (జూలై 1) ఉదయం హఠాత్తుగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావటంతో హరికాంత్ మృతి చెందారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రూపొందిస్తోన్న ‘కీడా కోలా’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్లోనూ కనిపించారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే హరికాంత్ కన్నుమూశారు.
![టాలీవుడ్ లో త్రీవ విషాదం..యువ నటుడు హరికాంత్ మృతి..! 2 టాలీవుడ్ లో త్రీవ విషాదం..యువ నటుడు హరికాంత్ మృతి..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/fdbfd6fa-0368-4cef-9921-637f9462b26e.jpg)
హరికాంత్ :
థియేటర్ అర్టిస్టుగా చాలా కాలం చేసిన హరికాంత్కు కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు దక్కాయి. ఈ క్రమంలోనే ఆయన టాలెంట్ గుర్తించిన తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇచ్చారని తెలుస్తోంది. కీడా కోలా సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది ఈ మూవీ విడుదలవుతుందని తరుణ్ భాస్కర్ ప్రకటించారు. అయితే, ఈలోగానే కీడా కోలా చిత్రంలో నటించిన హరికాంత్ మృతి చెందడం విషాదాన్ని నింపింది.
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది తర్వాత తరుణ్ భాస్కర్.. కీడా కోలా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది తర్వాత డైరెక్షన్కు ఐదేళ్లు గ్యాప్ తీసుకొని ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు తరుణ్. కీడా కోలా టీజర్ జూన్ 28న విడుదలైంది. ఈ సినిమాలో కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం, చైతన్యరావు, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. శ్రీపాద్ నందిరాజ్, వివేక్ సుదాన్షు, భరత్ కుమార్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ సంయుక్తంగా కీలా కోలా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా కీడా కోలా రూపొందుతోంది.