Kalyan Ram : మల్లిడి వశిష్ట్ టాలీవుడ్లో దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘బింబిసార’. నందమూరి కళ్యాణ్ రామ్ కొంచెం గ్యాప్ తర్వాత బింబిసార మూవీతో థియేటర్స్‌లోకి అడుగు పెట్టారు. తొలుత ఈ సినిమా గురించి పెద్దగా అంచనాలేమీ లేకపోయినప్పటికీ ట్రైలర్ రిలీజ్.. ఆ తరువాతి అప్ డేట్స్ మాత్రం అంచనాలను అమాంతం పెంచేశాయి. క్యాథరీన్ థ్రెసా, సంయుక్తా మీనన్, వరీన హుస్సేన్ హీరోయిన్స్‌గా నటించారు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ కావడం విశేషం. మరి ఈ సినిమాపై ప్రేక్షకులు ఏమంటున్నారు? సినిమాకు హిట్ టాక్ ఇస్తున్నారా? లేదా ఫట్ అంటున్నారా? ఓ లుక్కేద్దాం.
చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ తన నట విశ్వరూపాన్ని చూపించినట్టు ఆడియన్స్ చెబుతున్నారు. దీన్ని వన్ మ్యాన్ షోగా అభివర్ణిస్తున్నారు. క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రితం త్రిగర్తల సామ్రాజ్యం నిధి చుట్టూ బింబిసార కథను రూపొందించారు దర్శకుడు. ఇక బింబిసారుడిగా కళ్యాణ్‌రామ్ జీవించారని ఆడియన్స్ చెబుతున్నారు. ఆయన తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నారనేది చాలా ఆసక్తికరంగా ఉందని.. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. దీన్నొక విజువల్ వండర్‌గా అభివర్ణిస్తూ ట్విటర్‌ను హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచాయని అంటున్నారు.
Kalyan Ram : ఆయనకు తప్ప మరొకరికి సాధ్యం కాదు..
ఈ సినిమాను కళ్యాణ్‌రామ్ ఎంతో డెడికేషన్‌తో చేశారని.. ఆయనకు తప్ప మరొకరికి సాధ్యం కాదన్నట్టుగా చేశారని ఆడియన్స్ చెబుతున్నారు. స్టోరీ సూపర్‌గా ఉందని.. విజువల్స్ అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అదిరిపోయాయని పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా చూస్తే బింబిసార చిత్రానికి ఇప్పటి వరకైతే టాక్ అదిరిపోయింది. టాలీవుడ్ హీరోలు సైతం ఈ సినిమాకు మద్దతుగా నిలిచారు. చూడబోతే ఈ సినిమా కళ్యాణ్ రామ్‌కు మరో ‘అతనొక్కడే’ అవుతుందని అభిమానులు చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.