రీ రిలీజ్కు సిద్ధం అవుతున్న రెండు సూపర్ హిట్ సినిమాలు
మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా నుంచి ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకున్న విషయం మనఅందరికి తెలుసు . పోటీపడుతూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ను రాబడుతున్నాయి ఓల్డ్ సినిమాలు. అప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా రీ రిలీజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయినా మహేష్ బాబు బిజినెస్ మెన్, ప్రభాస్ యోగి సినిమా రీ రిలీజ్ అయ్యి విపరీతమైన కలెక్షన్ ల ను సొంతం చేసుకుంది.
![రీ రిలీజ్కు సిద్ధం అవుతున్న రెండు సూపర్ హిట్ సినిమాలు..? 2 రీ రిలీజ్కు సిద్ధం అవుతున్న రెండు సూపర్ హిట్ సినిమాలు..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-21T131745.372.jpg)
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హంగామా బాగా నడుస్తుంది. హీరోల పుట్టిన రోజులు మరియు స్పెషల్ డేస్ కు సినిమాలను రీ రిలీజ్ చేస్తునే ఉన్నారు మేకర్స్ . మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా నుంచి ఈ ట్రెండ్ బాగా అయింది . పోటీపడుతూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ను రాబడుతున్నాయి ఓల్డ్ సినిమాలు. అప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా రీ రిలీజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. . ఇక త్వరలోనే మరికొన్ని సినిమాలు కూడా రీ రిలీజ్ కానున్నాయి అని తెలిపారు . ఇదిలా ఉంటే వాటితో పాటు మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు కూడా రీ రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా కూడా ఒకటి. హిందీలో వచ్చిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిందంట . ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమాలో మెగాస్టార్ నటన, ఆయన కామెడీ టైమింగ్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధం అయింది . అయితే ఈ సినిమా మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అవుతుందా లేక ఆ తర్వాత రిలీజ్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఈ సినిమా రీ రిలీజ్ అని తెలిసిన దగ్గర నుంచి మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారంట .
ఇక ఈ సినిమాతో పాటు నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ఏ మాయ చేశావు సినిమాను రీ రిలీజ్ కూడా చేయనున్నారని కూడా తెలుస్తోంది. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ చాలా మందికి ఫెవరెట్ సినిమా . ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారంట మేకర్స్. ఈ సినిమాలే కాదు ఈ ఏడాది చివరిలోగా 12 సినిమాలు రీ రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.