మెగా డాటర్ నిహారిక తాజాగా తన విడాకుల కన్ఫర్మేషన్ తో వార్తల్లోకి ఎక్కింది జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం రాజస్థాన్లోని ఒక మహల్ లో అత్యంత వైభవంగా జరిగింది పెళ్లయిన రెండు సంవత్సరాలకి నిహారిక భర్తకి దూరంగా ఉంటూ వస్తోంది అలాగే చైతన్య మరియు నిహారిక సోషల్ మీడియాలో వారు ఇరువురు తమకి సంబంధించిన ఫోటోలని కూడా డిలీట్ చేశారు దీంతో అభిమానుల్లో అనుమానాలు రేకెత్తాయి అనుమానం కాస్త నిజమైంది.
![పాపం నాగబాబు నిహారిక పెళ్ళి ఖర్చు.... అన్ని కోట్ల ?? 2 పాపం నాగబాబు నిహారిక పెళ్ళి ఖర్చు.... అన్ని కోట్ల ??](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/359b424a-7361-4d59-a798-3ae070b9355e.jpg)
దీంతో ఇప్పుడు పలువురు నెట్టిజెన్లు నిహారిక పెళ్లి వల్ల నాగబాబు కు ఎంత ఖర్చు వచ్చింది అనే విధంగా నెట్టిండా సెర్చ్ చేస్తున్నారు ఇదంతా పక్కన పెడితే నిజంగానే నాగబాబు వీరి పెళ్లి కోసం భారీగానే ఖర్చు చేశారని తెలుస్తోంది కూతురి జీవితమే ముఖ్యమని భావించిన నాగబాబు నిహారిక పెళ్లిని అత్యంత వైభవంగా జరిపించారు దాదాపు 50 కోట్ల వరకు ఈ పెళ్లి కోసం ఖర్చు చేశారని సమాచారం. దీంతో మెగా అభిమానులు విడిపోయే జంట కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారు నాగబాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ లో జరుగుతున్న విడాకుల గురించి కాస్త బాధగానే ఉన్నారు