Vande Bharat Metro : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మినీ వెర్షన్ అయిన వందే మెట్రోను పెద్ద నగరాల చుట్టుపక్కల ప్రజలు తమ గమ్య స్థలానికి వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణించడానికి త్వరలో అందుబాటులోకి తీసుకు వస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు . 2023-24 కేంద్ర బడ్జెట్‌లో రైల్వేలకు అత్యధికంగా రూ. 2.40 లక్షల కోట్ల బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత విలేకరుల సమావేశంలో ప్రసంగించిన వైష్ణవ్, డిసెంబర్ 2023 నాటికి భారతదేశం మొదటి హైడ్రోజన్ రైలు ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఇది పూర్తిగా దేశీయంగా తయారు చేయబడుతుందని చెప్పారు.

వందే భారత్ రైళ్ల ప్రత్యేకతలు :
- సెమీ-హై స్పీడ్ లో స్లీపర్ వెర్షన్ వందే భారత్ రైళ్ల ను రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది.
- మెట్రో రైలు మాదిరిగా ఈ రైళ్లకు ఎనిమిది కోచ్‌లు ఉంటాయి.
- వందే భారత్ మెట్రో ద్వారా ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది.
- ప్రజలు తమ ఇంటి నుండి పెద్ద నగరాల్లోని కార్యాలయాలకు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వందే మెట్రోను అభివృద్ధి చేస్తున్నారు.
- చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లక్నోకు చెందిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ జనరల్ మేనేజర్‌లను రైల్వే మంత్రిత్వ శాఖ, ఎనిమిది కార్ల వందే భారత్ రైళ్లను త్వరగా ప్రారంభించాలని ఆదేశించింది.

ప్రయాణీకులకు, ప్రత్యేకించి వ్యాపారులకు, విద్యార్థులకు , పెద్ద నగరాలను తరచుగా సందర్శించాలనుకునే శ్రామిక వర్గ ప్రజలకు వందేభారత్ రైళ్లు తమ ప్రయాణ చిక్కులను తీరుస్తాయని విశ్లేషకుల అభిప్రాయం. వందే భారత్ రైళ్లు ఇప్పుడు ఐసిఎఫ్ చెన్నైతో పాటు మహారాష్ట్ర లోని లాతూర్ , హర్యానాలోని సోనిపట్ , ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలి లలో కూడా తయారు చేయబడతాయని మంత్రి తెలిపారు.