Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మొదటి ఐదు వారాల పాటు మోస్ట్ వాండెట్ లిస్ట్ లో బాలాదిత్య, రేవంత్ వీరిద్దరూ ఉండేవారు. దాదాపుగా ఇప్పటికీ వారిద్దరినే ఎక్కుమంది హౌస్ సభ్యులు నామినేట్ చేస్తూ వస్తున్నారు. అతి మంచితనంతో హౌస్ సభ్యులతో బాలాదిత్యకు విభేదాలు పెరిగిపోయాయి. అత్యుత్సాహంతో రేవంత్ కి హౌస్ సభ్యులతో గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇవి వీరిద్దరూ గేమ్ బాగా ఆడుతున్నందుకు వస్తున్న కష్టాలు.
ఇక ఇప్పుడు పరిస్థితి మారింది. ఎవరు తక్కువ ప్రదర్శన చూపిస్తారో వారిని హౌస్ లో నుండి బయటికి పంపేందుకు ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎవరిని పంపించాలి అనేది మీలో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి బిగ్ బాస్ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో వారిలో వారే వాదోపవాదనలు చేసుకుని ఫైనల్ గా ఓ పర్సన్ పేరును చెప్తున్నారు. అలా ఈ వారం ఎక్కువగా వాసంతి పేరు రావడంతో తను ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేరిపోయింది.
![Bigg Boss 6 Telugu: ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మోస్ట్ వాంటెడ్ ఎవరో తెలుసా..? 2 bigg boss](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/bigg-boss-6.jpg)
ఈ వారం బిగ్ బాస్ రద్దు చేసిన సెలబ్రిటీ టాస్క్ లో వాసంతికి బొమ్మరిల్లు సినిమాలో హాహిని కార్యరెక్టర్ ఇచ్చారు. అందులో బాగా ప్రదర్శన చేయలేదని హౌస్ సభ్యులు వారి అభిప్రాయం చెప్తారు. ఆ తర్వాత బ్యాటిల్ ఫర్ సర్వైవర్ గేమ్ లో ఆడేందుకు బాగానే ప్రయత్నించినప్పటికీ అందులో కూడా తక్కువ ప్రదర్శన ఇచ్చిన వారిని ఎంపిక చేయమని చెప్తే వాసంతి పేరే చెప్తారు. దీంతో ముందుగా చెప్పిన దాని ప్రకారం వచ్చే వారం వాసంతి హౌస్ లో నుండి నేరుగా బయటికి వెళ్లేందుకు నామినేట్ అయింది.
అక్కడితో ఈ వ్యవహారం ఆగిపోలేదు. తర్వాత హౌస్ లో డిజాస్టర్ ఎవరో అనేది ఎంపిక చేసి కారణాలు చెప్పాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఇందులో కూడా హౌస్ సభ్యులు ఎక్కువ మంది వాసంతి పేరును చెప్పడం జరుగుతుంది. దీంతో తక్కువ ప్రదర్శన కనబరిచిన వాసంతిని బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఈ వారం జైలుకి వెళ్తుంది. అలా ఈ వారం మోస్ట్ వాండెట్ లిస్ట్ లో వాసంతి చేరిపోంది. మరి వాసంతి వచ్చే వారం హౌస్ లో నుండి ఎలిమినేట్ అవుతుందా…. బిగ్ బాస్ ప్రేక్షకులు ఆమెను ఓటింగ్ ద్వారా సేవ్ చేస్తారా అనేది చూడాలి…!