Vijay Devarakonda : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘లైగర్’. ప్యాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మరోవైపు ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ విషయమై ఫుల్ బిజీబిజీగా గడిపేస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ముంబైలోనూ ప్రమోషన్స్ నిర్వహించారు. మన రౌడీ హీరో క్రేజ్ బాలీవుడ్‌ని సైతం తాకినట్టు ఈ సందర్భంగా తెలియవచ్చింది. అక్కడ బాలీవుడ్ స్టార్స్‌కు ఏమాత్రం తగ్గని ఫాలోయింగ్ రౌడీ స్టార్ కు కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్ర ట్రైలర్‌ని ఇటీవల ముంబైలోని అంథేరీ సినీపోలీస్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో లైగర్ టీమ్ మొత్తం పాల్గొంది. రౌడీ హీరో విజయ్‌ని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
Vijay Devarakonda : ‘రౌడీ రౌడీ’అంటూ నినాదాలు..
ప్రొగ్రామ్ పూర్తయిన తర్వాత విజయ్ అక్కడి నుంచి బయలుదేరగా అభిమానులు చుట్టుముట్టారు. ‘రౌడీ రౌడీ’అంటూ నినాదాలు చేస్తూ ఫోటోలో దిగేందుకు ఎగబడటం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోని చిత్ర యూనిట్ సంస్థ పూరీ కనెక్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ముంబై సీనీ పోలీస్ మాస్ థియేటర్‌గా మారిన అనుభూతి కలిగింది క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై మన రౌడీ హీరో స్పందించాడు. ‘ముంబై నా నివాసంగా ఫీలైన క్షణాలివే’అని రాసుకొచ్చాడు.లైగర్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ముఖ్య అతిథిగా హజరయ్యారు.
ఈ ఈవెంట్‌కు రణవీర్ సింగ్ చీఫ్ గెస్ట్ అయినప్పటికీ స్పెషల్ అట్రాక్షన్ గా విజయ్ హైలేట్ అయ్యాడు. విజయ్ చాలా సింపుల్ డ్రెస్సింగ్ స్టైల్‌తో చెప్పులు వేసుకుని హజరయ్యాడు. బ్లాక్ టిషర్ట్.. క్యాజువల్ ఖార్గో పాంట్ పైకీ హవాయి చెప్పల్ ధరించి కనిపించాడు. అనంతరం విజయ్, రణవీర్ సింగ్ కలిసి స్టేజ్ పైనే స్టెప్పులేశారు. అయితే విజయ్ చెప్పులు వేసుకుని రావడం గమనించిన రణవీర్ ఆసక్తికర కామెంట్ చేశాడు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే.. ఆయన సినిమా ట్రైలర్ లాంచ్ కు నేను వచ్చినట్లు లేదు. నా సినిమా ట్రైలర్ లాంచ్ కు ఆయన వచ్చినట్లు ఉంది. అయినా.. చెప్పులతో వచ్చినా కానీ విజయ్ స్టైల్ మాత్రం అదిరింది అంటూ ప్రశంసించారు..పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆగస్ట్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.