Vijay Devarakonda: విజయ్ దేవరకొండ తెలుగులో ప్రముఖ హీరోల్లో ఒకరుగా ఉన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా విజయ్ దేవరకొండ రివ్వున ఇండస్ట్రీలోకి దూసుకువచ్చారు. అర్జున్ రెడ్డి తరువాత విజయ్ దేవరకొండ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. విజయ్ కెరీర్ ని అర్జున్ రెడ్డి ముందు,అర్జున్ రెడ్డి తరువాత గా చూడొచ్చు. అర్జున్ రెడ్డి తరువాత ఆ స్థాయి విజయం లేకపోయినా విజయ్ ఎక్కడా తగ్గట్లేదు. తన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు.
అర్జున్ రెడ్డి విజయ్ ని ఎక్కడికో తీసుకుని వెళ్ళింది. కల్ట్ క్లాసిక్ అర్జున్ రెడ్డి తరువాత విజయ్ దేవరకొండ తన స్థాయి హిట్ అందుకోలేకపోయారు. డియర్ కామ్రేడ్,వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఫ్లాప్ జాబితాలోకి వెళ్లిపోయాయి. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన లైగర్ బాక్సాఫిస్ దగ్గర బోల్తా పడింది. పూరి జగన్నాద్ లాంటి దర్శకుడు ఉన్నా కూడా హిట్ గా మలచలేకపోయారు. దీంతో పూరి జగన్నాద్,విజయ్ దేవరకొండ తమ కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్ సినిమా మూటగట్టుకున్నారు.
లైగర్ ఫ్లాప్ తరువాత,ఎంతో భారీగా అనౌన్స్ చేసిన ‘జనగణమన’ కూడా క్యాన్సిల్ చేశారు. ఒకవేళ లైగర్ హిట్ అయ్యుంటే ‘జనగణమన’ పరిస్థితి మరోలా ఉండేదేమో. ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,విజయ్ దేవరకొండ స్టోరీ సిట్టింగ్ కోసం కలిశారట. కథ విన్న విజయ్ ప్రాజెక్ట్ చేద్దామని చెప్పారట. అయితే ఇప్పుడు విజయ్ కొత్త కండీషన్ పెట్టారట.
Vijay Devarakonda
ఇంతకుముందు అనుకున్నట్టు వేరే దర్శకులు కాకుండా త్రివిక్రమ్ దీనికి దర్శకులుగా ఉండాలని అన్నాడట విజయ్. ప్రస్తుతం త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. మహేష్ బాబు తో ఒక సినిమా మీద వర్క్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఇది అయ్యాక మరికొన్ని ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయని వినికిడి. ఇలాంటి బిజీ షెడ్యూల్ లో త్రివిక్రమ్ విజయ్ కోరిక మన్నిస్తారో లేదో అని విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.