రామ్ చరణ్ సినిమాలో విజయ్ సేతుపతి
ఆర్ఆర్ఆర్ సినిమా తో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్. ఈ సినిమా అఖండ విజయం తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. తనకు పాప పుట్టడంతో కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ తీసుకున్న రామ్ చరణ్.. తిరిగి మల్లి సెట్లో చేరారు. ప్రస్తుతం హీరో, హీరోయిన్ తో పాటు కీలక పాత్రధారులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యాన్ ఇండియా సినిమా గా భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.
ఇది సెట్స్‌పై ఉండగానే ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఒక సినిమాకు రామ్ చరణ్ ఓకే చెప్పాడంట . ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదించగా.. ఆయన కూడా ఓకే చెప్పినట్టు టాలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో విజయ్ ది ముఖ్యమైన పాత్రే కాకుండా విలన్ క్యారెక్టర్ అని కూడా తెలుస్తోంది. ఇప్పటికే ‘ఉప్పెన’ సినిమా లో నటించిన సేతుపతి బుచ్చిబాబుపై నమ్మకంతో రామ్ చరణ్ తో సినిమాకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై సినిమా వాళ్ళ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ సేతుపతి అంగీకరిస్తే మరో క్రేజీ కాంబినేషన్ అభిమానులను అలరించనుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లోసినిమా సూపర్ డూపర్ ఖాయమంటున్నారు సినీ ప్రేక్షకులు.