Vijay Sethupathi : తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా ఈ నటుడికి ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉంది. ఈ క్యారెక్టర్ లే చేస్తాను అంటూ మడి కట్టుకుని కూర్చోడు ఈ హీరో. హీరో అయినా, విలన్ అయినా , తండ్రి పాత్ర అయినా తన క్యారెక్టర్ కథకు బలాన్ని ఇస్తుంది అంటే కంచితంగా చేసే తీరుతాడు. అందుకే ఈ హీరో కు ఆల్ ఇండియా లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సేతుపతి సింప్లిసిటీ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. పక్కింటి కుర్రాడిలా తెరముందు కనిపిస్తుంటాడు. తాజాగా విజయ్ ఓ ఇంటర్వ్యూ లో యాంకర్ అన్న మాటలకు తీవ్రంగా కలత చెందాడట.

ఈ మధ్యన పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ సేతుపతి , ప్రభాస్ వంటి చాలా మంది నటులను పాన్ ఇండియా స్టార్స్‌గా ట్యాగ్ చేస్తున్నారు. ఇటీవల, హిందీ వెబ్ సిరీస్ ఫర్జీలో త్వరలో కనిపించనున్న తమిళ స్టార్ విజయ్ సేతుపతిని పాన్-ఇండియా నటుడిగా ఓ ఈవెంట్ లో సంబోధించారు. అయితే ఆ ట్యాగ్‌తో పిలవడం విజయ్ కి నచ్చలేదట.

ఇంటర్వ్యూ లో పాన్ ఇండియన్ స్టార్ అని అనగానే , విజయ్ లేదు సార్ నేను కేవలం నటుదుని అని అంటూనే , ఆ పాన్-ఇండియా స్టేట్‌మెంట్‌తో నేను కంఫర్ట్ గా లేనని అన్నారు. కొన్నిసార్లు ఆ ట్యాగ్ ఒత్తిడిని ఇస్తుందని అన్నారు. నేను కేవలం నటుడినినే, దాని కింద లేబుల్ పెట్టాల్సిన అవసరం లేదు అని ఇంటర్వ్యూ ను కొనసాగించాడు. గతంలో దుల్కర్ సల్మాన్ , ప్రభాస్ వంటి చాలా మంది దక్షిణాది నటులు పాన్-ఇండియా అనే పదానికి ఇంట్రెస్ట్ చూపలేదు.

వెబ్ సిరీస్ ఫర్జీ కోసం చేసిన ఇంటర్వ్యూ లో విజయ్ సేతుపతి తన బరువు తగ్గడం గురించిన విషయాలు కూడా పంచుకున్నాడు. తనకు డైటింగ్‌పై నమ్మకం లేదని ,రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడతానని, నేను రుచికరమైన ఆహారం తినకపోతే ఉండలేనని అన్నాడు . కానీ, గత కొన్నేళ్లుగా, నేను నటించేటప్పుడు నా శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను, కొన్ని పాత్రలు నా శరీరానికి సరిపోతాయి, కానీ అది నన్ను చాలా డిస్టర్బ్ చేస్తోంది, కాబట్టి, నేను ఓకే అనుకున్నాను అని అన్నాడు . 6 ప్యాక్స్ కాకుండా కేవలం ఫ్లెక్సిబుల్‌గా ఉండాలనుకుంటున్నాను అని తెలిపాడు.
