ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరక్షన్లో లియో చేస్తున్నారు దళపతి విజయ్. షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని వెంకట్ ప్రభు షూటింగ్‌కి వెళ్తారు. అక్టోబర్‌లో మొదలవుతుంది ఈ షూట్. అయితే ఈ కోలీవుడ్ మాస్టర్ ఫారిన్లో మరో ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు. దళపతికి లాస్ ఏంజెల్స్ లో త్రీడీ వీఎఫ్ఎక్స్ ని కూడా స్కాన్ చేశారు. మన స్టార్లు ఈ స్కాన్ చేయించుకోవడం ఇదేం ఫస్ట్ టైమ్ ఏమి కాదు.
ఆ మధ్య షారుఖ్ ఖాన్ చేశారు. రీసెంట్గా కూడా కమల్ చేశారు. విజయ్ ఇప్పటిదాకా చేయలేదు. కానీ ఇప్పుడు చేయక తప్పడం లేదు. స్క్రీన్ మీద ఒకరిగా కనిపిస్తే ఫర్వాలేదు. ఇద్దరిగా కనిపించాల్సి నప్పుడు, ఇలా చేస్తే బెటర్ అని సీనియర్స్ కూడా సలహా ఇస్తున్నారు.
ఇంతకీ వాళ్లేం చేశారు? దళపతి ఏం చేయబోతున్నారు? సస్పెన్స్ ఎందుకు అంటారా? అయితే వచ్చేయండి… డీటైల్స్ ను చెప్పేసుకుందాం.ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరక్షన్లో లియో సినిమా చేస్తున్నారు దళపతి విజయ్. షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని వెంకట్ ప్రభు కూడా షూటింగ్‌కి వెళ్తారు. అక్టోబర్‌లో మొదలవుతుంది ఈ షూట్. అయితే ఈ కోలీవుడ్ మాస్టర్ ఫారిన్లో మరో ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు.
దళపతికి లాస్ ఏంజెల్స్ లో త్రీడీ వీఎఫ్ఎక్స్ స్కాన్ చేశారు. మన స్టార్లు ఈ స్కాన్ చేయించుకోవడం ఇదేం ఫస్ట్ టైమ్ ఏమి కాదు. ఇప్పుడు జవాన్‌తో బిజీగా ఉన్న షారుఖ్ గతంలో ఫ్యాన్ సినిమా కోసం ఈ స్కాన్ చేయించుకున్నారు.
ప్రస్తుతం శంకర్ డైరక్షన్లో ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు కమల్‌హాసన్. ఈ సినిమా కోసం ఆయన రీసెంట్‌గానే ఈ స్కాన్ చేయించుకున్నారు. దళపతికి అక్కడి సంగతులన్నీ షారుఖ్, కమల్‌హాసన్ ఇద్దరూ వివరించారట. సో కాన్ఫిడెంట్‌గా చేయించుకున్నారు విజయ్.
వెంకట్ ప్రభు డైరక్షన్లో చేస్తున్న మూవీ లో డ్యూయల్ రోల్లో చేస్తారట విజయ్. ఒక కేరక్టర్‌కి జ్యోతిక జోడీగా చేస్తే, మరో కేరక్టర్‌కి ప్రియాంక మోహన్ జత కడతారని టాక్ వచ్చింది . అక్టోబర్ 19న విడుదల కానున్న లియో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాక , ఈ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెడతానని ముందే చెప్పేసారంట విజయ్. సో అక్టోబర్ ఎండింగ్ నుంచి దళపతి ఫ్యాన్స్ కి కొత్త సినిమాల అప్డేట్స్ వస్తూనే ఉంటాయి .