ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ పి.విజయబాబును తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్థకు ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించింది.
ఈ మేరకు భాషాశాస్త్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రొ. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. అక్టోబరు 2022లో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్థ చైర్మన్ లేకుండానే ఉంది.
తనపై ఉంచిన నమ్మకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి విజయ బాబు కృతజ్ఞతలు తెలిపారు.