హర్షవర్ధన్ అంటే త్వరగా గుర్తుకు రాదు కానీ.. తెలుగులో అవును, అవును 2 సినిమాల్లో హీరోగా నటించాడంటే ఠక్కన గుర్తుకొస్తుంది. ఈ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు .తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అంతగా క్రేజ్ రాలేదు.అయితే ఇక్కడి దర్శకులు ఇతడిని పెద్దగా పట్టించుకోకపోవడంతో బాలీవుడ్ వెళ్లి ప్రయత్నించగా అక్కడ బాగా క్లిక్ అయ్యాడు. అప్పట్నుచి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. అంతేకాదు అక్కడ లేడీ నటీనటులతో కూడా డేటింగ్ లు చేసి పాపులర్ అయ్యాడు. కిమ్ శర్మ, మీనాక్షి దాస్ తో ప్రేమాయణం నడిపి విడిపోయాడు. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లయిన నటిమణులతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
![సినిమాల్లో కంటే ఎఫైర్లతోనే ఎక్కువగా వైరల్ ??? 2 సినిమాల్లో కంటే ఎఫైర్లతోనే ఎక్కువగా వైరల్ ???](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-87.jpg)
హర్షవర్ధన్ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్న హర్షవర్ధన్ సినిమాల్లో కంటే ఎప్పుడు ?ఎఫైర్ .. న్యూస్లతోనే ఎక్కువగా వైరల్ అవుతున్నాడు. మొదట్లో నటి కిమ్ శర్మ తో డేటింగ్ చేశాడు. కొన్నాళ్లపాటు వీరు ఫుల్‌గా ఎంజాయ్ చేశాక బ్రేకప్ అయ్యింది.
ఆ తర్వాత కిమ్ శర్మ లియండర్ పేస్‌తో సెటిల్ అయిపోయింది. కొంతకాలం ఖాళీగా ఉండి తర్వాత మీనాక్షి దాస్‌తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరు విడిపోవడంతో ముచ్చటగా మూడోసారి తనతో పాటు నటించిన సంజీదా షేక్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సంజీదాకు ఇదివరకే పెళై ఒక పాప కూడా ఉంది.
తర్వాత సంజీదా, 2 ఏళ్ళ క్రితం అతనికి విడాకులు ఇచ్చింది. ఇప్పుడు హర్షవర్ధన్ – సంజీదా కలిసి షికార్లు చేస్తున్న ఫోటోలు మీడియాకు చిక్కాయి కొనెల క్రితం హర్షవర్ధన్ తన సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. ఒకే లోకేషన్లో వీరిద్దరు ఉన్నట్టు తేలింది. ఆ ఫొటోల్లో సంజీదా కూతురు కూడా ఉండడం విశేషం. దీంతో వీరి మధ్య ఏదో నడుస్తుందన్న రూమర్లు అయితే బీ టౌన్లో జోరుగా వినిపిస్తున్నాయి.