Viral: ఓ వ్యక్తి ట్రక్కులో టమాటలు నింపే విధానం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బుట్టను గాల్లోకి విసిరేస్తే అందులోని టమాటాలు ట్రక్కులో పడి, బుట్ట దానంతట అదే వెనక్కు వచ్చి కిందపడిపోతుంది. అందువలన ట్రక్కులో వేగవంతంగా టమాటాలు వేసే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తి ‘అర్నాల్డ్ పవర్… ఐన్‌స్టీన్ మెదడు’’ గలవాడు అంటూ ఆ వ్యక్తిని నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఈ వ్యక్తి ట్రక్కులో టమాటాలు వేసే క్రమంలో ఓ వ్యక్తి పాటిస్తున్న ట్రిక్ ఇప్పుడు అందర్నీ అశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సాగర్ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయగా దీన్ని కోటి మందికి పైగా చూడడం విశేషం. సాధారణంగా టమాటాలను ట్రక్కులో వేయడానికి చాలా మంది ఎంతో కష్టపడి పోతుంటారు.
\
బుట్టలో టమాటాలు నింపుకొని మనం ఎంత జాగ్రత్తగా లేపి ట్రక్కులో వేసినా మళ్ళీ ఖాళీ బుట్టను కింద పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి చాలా టైమ్ కూడా పడుతుంది. ఓ వ్యక్తి మాత్రం బుట్టను గాల్లోకి విసిరేస్తే అందులోని టమాటాలు ట్రక్కులో పడి, ఖాళీ బుట్ట దానంతట అదే వెనక్కు వచ్చి కిందపడిపోతుంది. దీంతో చాలా ఫాస్ట్‌గా ట్రక్కులో టమాటాలు వేసే అవకాశం కలుగుతోంది.
Viral:
ఈ వ్యక్తిది ‘అర్నాల్డ్ పవర్… ఐన్‌స్టీన్ మెదడు’’ అంటూ ఆ వ్యక్తిని నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. సినిమాల్లో రజనీకాంత్, చిరంజీవి మాత్రమే ఇలా చేస్తాడని, నిజ జీవితంలో ఈ వ్యక్తి రజనీకాంత్‌ను మించిపోయాడని కొందరు కామెంట్లు పెడుతున్నారు.