Viral: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని పోలీసులు చెబుతుంటారు. హెల్మెట్ ధరించకపోతే వెంటనే ఫైన్ బాదేస్తుంటారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఇక ట్రాఫిక్ నిబంధనలు మరీ కఠినంగా ఉంటాయి. ఈ మధ్య ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తే వెయ్యి రూపాయల జరిమానా, సిగ్నల్ దగ్గర క్రాస్ లైన్ దాటితే వంద రూపాయల జరిమానా అని కొత్త నిబంధనలు తెచ్చారు. హెల్మెట్ లేకుంటే నేరుగా సీసీ కెమెరాల్లో బండి నంబర్ గమనించి కూడా ఫైన్ విధిస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు.
కర్ణాటకలోని బెంగళూరులో ఓ చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసుకే ఫైన్ పడింది. ట్రాఫిక్ పోలీసులు మరో పోలీసుకు చలానా వేశారు. తప్పుడు హెల్మెట్ ధరించినందుకు ఈ ఫైన్ పడింది. దీనికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. స్కూటీని నడుపుతూ నగరంలో నిషేధించిన హాఫ్ హెల్మెట్ ను ధరించాడు ఆ పోలీసు.
ఇందుకు గానూ అతడిని పట్టుకొని ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. ఈ ఫొటోలను ఆర్టీ నగర్ ట్రాఫిక్ బీటీపీ ట్విట్టర్ లో షేర్ చేశారు. అయితే, దీనిపై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. సార్.. ఇలాంటి చెకింగ్ లు ఇంకా పెరగాలి.. సిటీలో చాలా మంది పోలీసులు ఇలా చేస్తున్నారు.. అంటూ ఓ కామెంట్ కనిపించింది. ట్రాఫిక్ నియమాలు అనేవి అందరికీ వర్తిస్తాయి.. పోలీసులు కూడా ఫాలో అవ్వాల్సిందేనంటూ మరో యూసర్ కామెంట్ చేశారు.
Viral: సీసీ కెమెరాలుంటాయ్ జాగ్రత్త..
ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. మరోవైపు సీసీ కెమెరాల ఆధారంగా కూడా హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వ్యక్తులకు జరిమానాలు విధిస్తుంటారు పోలీసులు. బెంగళూరులో ఇలాగే చేసిన ఓ బైకర్ కు ఫైన్ విధించారు పోలీసులు. అతడు ట్రాఫిక్ పోలీసుల వాదనను సవాల్ చేయగా, వెంటనే హెల్మెట్ లేకుండా నడిపిన ఫొటోను ప్రూఫ్ గా పంపారు పోలీసులు.
Good evening sir
half helmet case booked against police
Tq pic.twitter.com/Xsx5UA40OY— R T NAGAR TRAFFIC BTP (@rtnagartraffic) October 17, 2022