పఠాన్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నాడు షారుఖ్ ఖాన్. అయితే తర్వాత రానున్న జవాన్ సినిమాపైనా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధిచిన మ్యూజిక్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఎట్టకేలకు పఠాన్ చిత్రంతో భారీ విజయం అందుకున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి పరాజయాలు ఎదురవుతూ నాలుగైదేళ్లు తెరపై కనిపించని షారుఖ్ పెద్ద హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. షారుఖ్ పఠాన్ సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల రూపాయలను వసూలు చేసింది. షారూఖ్ బాక్సాఫీస్ బాద్ షా అని మరోసారి నిరూపితమైంది.
![వామ్మో.. భారీ ధరకు షారుక్ 'జవాన్' సినిమా మ్యూజిక్ రైట్స్ 2 వామ్మో.. భారీ ధరకు షారుక్ 'జవాన్' సినిమా మ్యూజిక్ రైట్స్](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Jawan-copy.jpg)
షారుక్ ‘జవాన్’ సినిమా :
ఈ చిత్రంలో దీపికా పదుకొణె(Deepika Padukone) కూడా అతిథి పాత్రలో కనిపించనుంది. దీపికపై గతేడాది ఆగస్టులో చెన్నైలో ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. పూణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, రాజస్థాన్, ఔరంగాబాద్‌లలో చిత్రీకరణ జరిగింది. పఠాన్ అద్భుత విజయం తర్వాత సహజంగానే జవాన్‌పై అంచనాలు పెరిగాయి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్(Atlee Kumar) ‘జవాన్’ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అట్లీ కుమార్ తమిళంలో సూపర్ హిట్ చిత్రాలను అందించాడు. ఇప్పుడు షారుఖ్‌తో చేతులు కలపడంతో సహజంగానే హైప్ పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ చూసి అభిమానులు వావ్ అంటున్నారు. ‘జవాన్’ సినిమాను జూన్ 2న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే అది వాయిదా పడింది.