‘ఈ నగరానికి ఏమైంది’ ఈ సినిమా 2018లోవిడుదలై ప్రేక్షకులని తెగ ఆకట్టుకుంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, సాయి సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించి అభిమానులని సంపాదించుకున్నారు.ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా థియేటర్లలో రీ రిలీజ్ చేయగా కలెక్షన్స్ రికార్డ్స్ ని క్రీయేట్ చేసింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో సాయి సుశాంత్ పోషించిన కార్తీక్ పాత్ర కూడా హైలెట్‌గా నిలిచింది.
![పెళ్ళికి సిద్దమైన ‘ఈ నగరానికి ఏమైంది’ నటుడు.. 2 పెళ్ళికి సిద్దమైన ‘ఈ నగరానికి ఏమైంది’ నటుడు..](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/37a1b9db-0d57-4bc9-83af-38b800fcb7f0-1.jpg)
బౌన్సర్ నుంచి క్లబ్ మేనేజర్‌గా ఎదిగి జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్లాలంటూ కలలు కనే సాధారణ యువకుడి పాత్రలో సాయి సుశాంత్ మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి సుశాంత్ జీవితంలోపెళ్ళికి రెడీ అయ్యాడు.
త్వరలోనే అతను పెళ్లిపీటలెక్కనున్నాడు. తాజాగా తనకు కాబోయే భార్యతో నిచితార్థం రోజు రింగ్ తొడుగుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.దింతో అభిమానులు,నెటిజన్లు అభిమానులు, అభినందనలు , శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఆ అమ్మాయి ఎవరు అనేది కానీ ఆమె వివరాలు కానీ సాయి సుశాంత్ పంచుకోలేదు.