ఉదయ్ కిరణ్
టాలీవుడ్ నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి స్టార్ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. ఇతను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక సెన్షేషన్ అనే చెప్పాలి. ఒకప్పుడు అమ్మాయిల కళల రాకుమారుడు అంటే ఉదయ్ కిరణ్ పేరు ను చెప్పేవారు. సినిమా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్.. నువ్వు నేను మూవీతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ సినిమా తరువాత ఎన్నో మంచి సినిమాలు చేసి అందరిని మెప్పించిన ఉదయ్ కిరణ్ లైప్ ఎలా టర్న్ అయిందో అందరికీ తెలిసిందే.
![ఉదయ్ కిరణ్ జరిగినట్టే.. ఆయన సిస్టర్ కి కూడా జరుగుతుందా ? 2 ఉదయ్ కిరణ్ జరిగినట్టే.. ఆయన సిస్టర్ కి కూడా జరుగుతుందా ?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-29T142005.062.jpg)
చిన్న వయస్సులోనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం ఇప్పటికీ ఉదయ్ కిరణ్ అభిమానులను బాధిస్తూనే ఉన్నరు . ఆయన ఎందుకు చనిపోయారనే విషయం ఇప్పటికీ ఇండస్ట్రీలో మిస్టరీగానే మిగిలింది. ఉదయ్ కిరణ్ సిస్టర్ ఇండస్ట్రీలో ఒక స్టార్ సింగర్ అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రామే తెలుసు. ఆమె మరెవ్వరో కాదు.. సింగర్ పరణిక. ఉదయ్ కిరణ్ కి ఆమె సొంత చెల్లెలు కాదు.. చిన్నమ్మ కూతురు. సూపర్ స్టార్ సింగర్స్ ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకుంది పరిణిక.
ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మంచి మంచి ఆఫర్లతో ఎలా దూసుకెళ్లాడో.. ఇప్పుడు ఆయన చెల్లెలు కూడా అలాంటి పరిస్థితులనే ఫేస్ చేస్తుందట. ఆ సమయంలో ఉదయ్ కిరణ్ డబ్బు పరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ పరణికకు డబ్బు పరంగా ఆ సమస్య ఏమిలేదు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అలా ఉదయ్ కిరణ్ తో పరణికకి ఉన్న రిలేషన్ షిప్ చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పరణిక పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.