మలయాళీ హీరోయిన్ హనీ రోజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. టాప్ హీరోయిన్ గా ఈ మధ్య భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. మలయాళీ నుంచి వచ్చినా.. తెలుగునాటి చాలా తక్కువ టైం లోనే పాపులారిటీని సొంతం చేసుకున్నారు . ఆమె ఎలాంటి స్టిల్ ఇచ్చినా ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటుంది .
ఆమె ఇటీవల ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. సినిమాల కంటే ఆమె ఈవెంట్స్ లలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆమె ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లినా అక్కడ ఆమెను చూడడానికి జనం క్యూ కడుతూ ఉండేవారు . ఇలా చాలా తక్కువ టైం లోనే ఆమె స్పెషల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది . ఆమెకు జనాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఇంత క్రేజ్ ఉన్నా అవకాశాలు మాత్రం తక్కువగానే వస్తున్నాయి.
![రిబ్బన్ కటింగ్ కే హానీ రోజ్ రెమ్యునరేషన్ మరి ఇంతనా..? 2 రిబ్బన్ కటింగ్ కే హానీ రోజ్ రెమ్యునరేషన్ మరి ఇంతనా..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/574dabd4-8a95-4ed7-bbf6-5bba6d96e588.jpg)
మలయాళంలో ఒక రేంజ్ లో పాపులర్ అయినా బ్యూటీ హానీ రోజ్ ప్రెసెంట్ తెలుగు నాటి కూడా ఒక రేంజ్ లో ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. వీర సింహ రెడ్డి సినిమాతో హానీ రోజ్ తెలుగులో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు తక్కువే ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్కీ షాపింగ్ మాల్ కు హనీ రోజ్ ముఖ్య అతిధిగా వెళ్లారు. ఇందు కోసం ఆమెకు ఎక్కువ రెమ్యునరేషన్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. రిబ్బన్ కటింగ్ కి ఆమె 60 నుంచి 70 లక్ష డిమాండ్ చేసారంట . దీనితో రిబ్బన్ కటింగ్ కే అంత రెమ్యునరేషనా అంటూ నెటిజన్స్ కామన్స్ చేస్తున్నారు . .