టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో, పవన్ బసంశెట్టి దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రంగబలి. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించలేక పొయ్యింది . బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు. ఇప్పడు ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.
![ఓటిటిలో స్ట్రీమింగ్ కి “రంగబలి”ఎప్పుడంటే ..? 2 ఓటిటిలో స్ట్రీమింగ్ కి “రంగబలి”ఎప్పుడంటే ..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-29T154730.221.jpg)
ఈ చిత్రం ఆగస్ట్ 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఈ చిత్రం ను థియేటర్ల లో చూడని వారు చూసేందుకు ఇది మంచి అవకాశం. ఈ చిత్రం డిజిటల్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో సత్య,మురళి శర్మ, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందించారు.