సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మల్టీ సార్టర్లుగా తెరకెక్కిన చిత్రం బ్రో . ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. తమిళ సినిమా వినోదయ సీతంకు రీమేక్ గా వచ్చిన బ్రో చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో సముద్రఖనియే దర్శకత్వం వహించారు. కాగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా రూపొందించారు. కేవలం 21 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
![నువ్వు రోజు ఎక్కడ అడుగు పెడుతున్నావ్ బ్రో..అదిరిపోయే రీప్లే..! 2 నువ్వు రోజు ఎక్కడ అడుగు పెడుతున్నావ్ బ్రో..అదిరిపోయే రీప్లే..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-03T154956.854.jpg)
అయితే.. ఈ సినిమా విడుదల అయ్యాక మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిపై కాలు పెట్టి నుంచున్న షాట్ ఒకటి ఉంటుంది. అయితే.. ఈ సన్నివేశం పై ఓ నెటిజెన్ కామెంట్ చేసారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కామెంట్ చేసినట్లు అనిపిస్తుంది. “ఎర్త్ మీద కాలు పెట్టడం కరెక్ట్ కాదు బ్రో..” అని ఓ నెటిజెన్ కామెంట్ చేసారు.
కాగా.. దీనికి మరొక నెటిజెన్ ఇచ్చిన రిప్లై చూసి అందరు తెగ నవ్వుకుంటున్నారు. ఆ కామెంట్ పెట్టిన నెటిజెన్ ని “నువ్వు రోజు ఎక్కడ అడుగు పెడుతున్నావ్ బ్రో?” అంటూ రిప్లై ఇచ్చారు. ఈ కామెంట్ చూసి ఇతర నెటిజన్స్ ఫన్నీ గా రియాక్ట్ అవుతున్నారు. కేవలం విమర్శించే ఉద్దేశ్యంతోనే కొందరు ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే..ఈ కామెంట్ కి మరో నెటిజెన్ అదే రేంజ్ లో తిప్పి కొట్టారు.