సినీ పరిశ్రమలో నటిస్తున్న హీరో లు , హీరోయిన్ లలో కొంతమంది ఎంత వయస్సు మీద పడిన కూడా పట్టించుకోకుండా సినిమాలు చేస్తుంటారు . పెళ్లి మాట ఎత్తగానే మాట దాటేస్తారు . ఇలాంటి సంఘటనలు చాలా సందర్భాలలో మనం గమనించుంటాం . ఇదే తరహాలో ఒక్కప్పుడు ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ “సద” అదే లిస్ట్ లో చేరారు . 2002 లో తేజ గారి దర్శకత్వం లో వచ్చిన చిత్రం ” జయం“. ఈ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన హీరోయిన్ సదా. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు పలు భాషల్లో పలు చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం సదాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు టీవీ డ్యాన్స్ షోలు, రియాల్టీ షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతానికి ఆమె వయసు కూడా 39 ఏళ్లకు చేరుకుంది. ఇప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. దీంతో ఎక్కడకు వెళ్లినా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఆమెకు ఎదురవుతున్నాయి.
![పెళ్ళయితే స్వేచ్ఛ నీ కొల్పోతమన్న ప్రముఖ హీరోయిన్ ఎవరంటే??? 2 పెళ్ళయితే స్వేచ్ఛ నీ కొల్పోతమన్న ప్రముఖ హీరోయిన్ ఎవరంటే???](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-62.jpg)
ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకి పెళ్లిమీద ఉన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు . వివరాల్లోకి వెళితే తనకి పెళ్లంటే ఆసక్తి లేదని , పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ కోల్పోతామని చెప్పుకొచ్చారు . పెళ్లి చేసుకోబోయే వాడు నన్ను అర్దమ్ చేసుకోవొచ్చు , అర్దమ్ చేసుకోకపోవచ్చు అని పేర్కొన్నారు . ఈ రోజులల్లో పెళ్లిళ్లు చిన్న చిన్న కారణాల వాళ్ళ విడిపోతున్నారని , ఎక్కువ శాతం పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడటం లేదని , అందుకే తనకి పెళ్లి పై ఆసక్తి లేదని చెప్పింది . మున్ముందు ఆమెకి పెళ్లి పట్ల అభిప్రాయం మారుతుందేమో , లేదో తెలియాలంటే కొద్దీ కాలం పాటు వేచి ఉండవలసిందే……