సమంతతో కలసి థియేటర్లలో ఖుషి చేసేందుకు రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ. రౌడీ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా లైగర్ ఎఫెక్ట్ ఏమైనా పడిందా..? అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. విజయ్, సమంత కాంబినేషన్లో తెరకెక్కిన ఈ… రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఖుషి. సెప్టెంబర 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా మీద అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలు తలెత్తాయి .
లైగర్ సినిమాతో నిరాశపరిచిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ లాంగ్ గ్యాప్ తరువాత మరో సినిమా తో ఆడియన్స్ ముందుకువచ్చేస్తున్నారు . రౌడీ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కి లైగర్ ఎఫెక్ట్ ఏమైనా పడిందా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
![లైగర్ ఎఫెక్ట్ నుంచి ఖుషి సినిమా తప్పించుకునేనా.? 2 లైగర్ ఎఫెక్ట్ నుంచి ఖుషి సినిమా తప్పించుకునేనా.?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-22T150153.634.jpg)
ఖుషి కన్నా ముందు విజయ్ నటించిన సినిమా లైగర్ దారుణంగా ఫెయిల్ అయ్యింది అని తెలుసు . పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన సినిమా లైగర్కి మినిమమ్ బజ్ కూడా రాకపోవటంతో ఆ ఎఫెక్ట్ విజయ్ నెక్ట్స్ సినిమా మీద కూడా ఉంటుందని భావించారు. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తుంటే అది అలా అనిపించటం లేదు.
టాక్ పరంగానే కాదు బిజినెస్ పరంగానూ మంచి నెంబర్స్‌ను రికార్డ్ చేస్తోంది ఖుషి. విజయ్, సమంత కాంబో మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌తో పాటు, ఆడియో సూపర్ హిట్ కావటంతో ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఈ మూవీ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 50 కోట్ల మార్క్ దాటిందన్న టాక్ వినిపిస్తోంది.
సినిమా మీద మంచి బజ్ ఉండటంతో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని భావిస్తున్నారు. యావరేజ్ టాక్ వచ్చినా ఖుషీ ఈజీగా సేఫ్ అవుతుంది. అదే సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం రౌడీ భాయ్ మరోసారి వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వటం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
ఈ సినిమా అటు విజయ్, ఇటు సమంత ఇద్దరు సాలిడ్ హిట్ అందుకుంటారని ఖచ్చితంగా చెప్తున్నారు ఫ్యాన్స్. మరి అభిమానులను ఖుషి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.