చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖుల విషెస్
విజయం వచ్చినప్పుడు పొంగిపోవడం.. అపజయం వచ్చిన కుంగిపోవడం తెలియని హీరో. నటన అంటే ఇష్టం.. సినిమా అంటే ఆయనకు ప్యాషన్. అందుకే ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమా లు చేస్తూ ఇప్పటికీ అభిమానులను తన సినిమాలతో అలరించాలని తాపత్రయపడుతుంటారు చిరు .
మెగాస్టార్ చిరంజీవి.. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజు చిరు . నటనపై ఆసక్తి ఉండి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎందరో నటీనటులకు ఆయనే మంచి స్పూర్తినిచ్చారు . అవమానాలను ఎదుర్కొని స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన అసామాన్యుడు చిరంజీవి అని చెప్పుకోవచ్చు . తనపై ఎవరెన్ని విమర్శలు చేసిన.. చిరునవ్వుతో సర్దుకుపోయి.. తన పని తాను చేసుకుపోయే మంచి మనసున్న వ్యక్తులలో ఒకరు చిరు . నవతరం నటీనటులకు, డైరెక్టర్లకు నటనలో ఎన్నో సలహాలు ఇస్తూ.. వారిని ఎప్పటికప్పుడు ప్రోత్సాహిస్తూ వెన్నంటే నిలబడే గొప్ప వ్యక్తి. అందుకే ఇండస్ట్రీలో చిరు అంటే అభిమానం ఉండని వారు లేరు. కేవలం హీరోగానే కాదు.. సామాజిక సేవలోనూ చిరు ముందుంటారు. ముఖ్యంగా సినీ కార్మికులకు.. నటీనటులకు తనవంతు సాయం చేస్తూ వారిని కష్టాల్లో ఆదుకుంటు ఉంటారు .
![చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖుల విషెస్..! 2 చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖుల విషెస్..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-22T125245.527.jpg)
ఈరోజు (ఆగస్ట్ 22) చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నాయి . చిరుతో అనుబంధం ఉన్నవారు.. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నెట్టింట పోస్టులు పెడుతునే ఉన్నారు .“అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతుడికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాకా లక్షలాది మందికి సమయ స్పూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయితీ, సేవా భావం నాలాంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు , ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే అన్నయ్య ” అంటూ పోస్ట్ చేశారు.