సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఇప్పటికే ప్రకటించారు. డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ మూవీలో తన పాత్రకి సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడానికి సమంత సిద్ధం అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ కాన్సెప్ట్ ఇప్పటి వరకు తెలుగులో రాలేదని టాక్ వినిపిస్తుంది. సరికొత్త ఎలిమెంట్ ని దర్శకులు ఈ చిత్రం కోసం ఎంచుకున్నారని టాక్.ఇప్పటికే యశోద నుంచి వచ్చిన టీజర్ ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి సంబందించిన కథ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
కథ ప్రకారం ఓ కాస్మొటిక్ కంపెనీ ఆడవాళ్ళ సౌందర్యం కోసం ఒక పేస్ క్రీమ్ ని తయారు చేస్తుంది. అయితే అది రాసుకున్న తర్వాత వారిలో తెలియని మార్పులు వస్తాయి. ఓ గందరగోళం నెలకొంటుంది. దీంతో అయితే ఆ విషయం బయటకి రాకుండా ఆపాలని కంపెనీ అనుకుంటుంది. అయితే చర్మ సమస్యతో బాధపడే యశోద కూడా ఆ పేస్ క్రీమ్ కి సంబందించిన ఎక్స్పరిమెంట్ లో హ్యూమన్ ట్రైల్స్ లో పాల్గొంటుంది. అయితే దాని గురించి తెలుసుకున్న తర్వాత వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది.
అలా కంపెనీ వారికి, సమంత పాత్రకి మధ్య జరిగే సంఘర్షణతోనే ఈ సినిమా కథ ఉంటుందని టాక్. ఈ కంటెంట్ సమంత నిజజీవితానికి దగ్గరగా ఉన్న లైన్ కావడంతో ఆమె బాగా కనెక్ట్ అయినట్లు తెలుస్తుంది. సమంత కూడా నటిగా కెరియర్ ఆరంభంలో చర్మ సమస్యతో బాధపడింది. తరువాత దానికి ట్రీట్మెంట్ కూడా చాలా కాలం తీసుకుంది. ఇప్పడు అదే పాయింట్ తో యశోద కథని ఆమెకి దర్శకులు చెప్పడంతో బాగా కనెక్ట్ అయ్యి చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీకి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేసినట్లు సమాచారం. వారి శిక్షణలో చాలా కఠినమైన యాక్షన్ సన్నివేశాలని సమంత చేసిందని టాక్ వినిపిస్తుంది.