Three Capitals: ఏపీలో అధికార పార్టీ వైసీపీ అమరావతి రాజధాని అనే అంశాన్ని పక్కన పెట్టి మూడు రాజధానుల కాన్సెప్ట్ ని తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ మూడు రాజధానుల విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే వరకు కనీసం వైసీపీ ఎమ్మెల్యేలకి కూడా ఆ నిర్ణయం గురించి తెలియదు అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ముందుగా అమరావతి రాజధానిగా ఉంటుంది. అని బల్లగుద్ది చెప్పిన వైసీపీ నాయకులు తమ ముఖ్యమంత్రి స్టాండ్ మార్చుకోవడంతో వారందరూ కూడా తప్పనిసరి పరిస్థితిలో అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఒక పార్టీలో ఉన్న తర్వాత అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ మూడు రాజధానుల అంశానికి మద్దతు ఇచ్చారు.
అయితే మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో విభేదించే ధైర్యం ఎవరికీ లేదని చెప్పాలి. ఈ కారణంగానే చాలా మంది నాయకులకి ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ అనేది అస్సలు ఇష్టం లేకపోయిన తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక వైసీపీ అధిష్టానం ఆదేశాల ప్రకారం మూడు రాజధానుల అంశాన్ని ఎమ్మెల్యేలు అందరూ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నాయకులకి మూడు రాజధానుల కాన్సెప్ట్ బొత్తిగా ఇష్టం లేదనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీ నుంచి బయటకి వచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి రాజధానిగా ఉండాలనేది తమ వ్యక్తిగత అభిప్రాయం అని తెలిపారు.
అయితే అప్పట్లో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి మూడు రాజధానుల గురించి ప్రచారం చేసామని అన్నారు. అలాగే ఆనం రామనారాయణరెడ్డి కూడా అమరావతి రాజధానిగా ఉండటం అనేది సరైన నిర్ణయం అని సమర్ధించినట్లు తెలుస్తుంది. అలాగే గతంలో రఘురామకృష్ణంరాజు కూడా అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చారు. ఈ నేపధ్యంలో వైసీపీ అధిష్టానంకి ఆయనకి మధ్య దూరం పెరిగింది. వైసీపీ నుంచి బయటకి వస్తున్న అందరూ కూడా జగన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అస్సలు సమర్ధనీయం కాదని చెబుతున్నారు. అలాగే ఆ మాట మూడేళ్ళ నుంచి చెబుతూ ప్రజలని మోసం చేయడం తప్ప చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదని పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు.