Food Cravings: చాలా మంది ఆకలికి తట్టుకోలేరు. కొంత మందికి మూడు పూటలా తిన్నప్పటికీ అర్ధరాత్రి పూట ఆకలేస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ నిద్రిస్తుంటారు. కానీ వీళ్లు మాత్రం లేచి ఫ్రిజ్ లోనూ, వంటింట్లోనూ దూరి ఏమేం ఉన్నాయా.. నోటికి పని చెబుతాం అని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారి సమస్యను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి త్వరగా భోజనం తినేసి పడుకుంటున్న వారికి అర్ధరాత్రి ఆకలేసే ఇబ్బందికర పరిణామం ఏర్పడుతూ ఉంటుంది. దాంతో పాటు సాయంత్రం పూట జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా అర్ధరాత్రి అయ్యేసరికి కడుపు ఖాళీ అయ్యి ఆకలేస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆకలికి తట్టుకోలేక అర్ధరాత్రి పూట ఏదో ఒకటి లాగించేస్తూ ఉంటారు.
అర్ధరాత్రి తింటే ఏమవుతుందో తెలుసా?
నడిరాత్రి తినడం అలవాటయ్యే వారికి చాలా సమస్యలు వేధిస్తాయి. సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. దీని వల్ల మనిషికి జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మానసిక సమస్య వచ్చే ప్రమాదమూ ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, అల్సర్ లాంటి ప్రమాదకర రోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. అందుకే అర్ధరాత్రి తినడం అనేది తగ్గించుకుంటే హెల్త్ మెరుగవుతుంది. రాత్రి పూట ఒక్కసారి తినేసి పడుకున్నాక మళ్లీ ఉదయమే బ్రేక్ ఫాస్ట్ చేసేలా చూసుకోవాలి. అర్ధరాత్రి ఆకలేసినా కాస్త నిగ్రహించుకుంటే సరి.
Food Cravings:
రాత్రి పడుకొనే ముందు బ్రష్ చేసుకుంటే అర్దరాత్రి ఆకలేయడం లాంటి సమస్య తగ్గుతుందంటున్నారు నిపుణులు. అప్పటికీ మధ్య రాత్రిలో తినాలి అనిపిస్తే కాస్త మంచినీళ్లు తాగి పడుకుంటే సరిపోతుందంటున్నారు. నీళ్లు సరిపోకపోతే కాస్త ఏదో ఒక ఫ్రూట్ తీసుకొని ఓ రెండు ముక్కలు తినేసి పడుకోవాలట. పండ్లు తినాలని చెప్పారు కదా.. ఇక నాలుగైదు లాంగించేద్దాం అని ఆలోచించరాదు. అర్ధరాత్రి సమయంలో బెర్రీస్, నట్స్, స్కిమ్డ్ పెరుగు, ఉడికించిన గుడ్లు, క్యారెట్లు వంటివి తిన్నా కడుపులో ఇబ్బందులు రావు. కాబట్టి.. అర్ధరాత్రి తినే అలవాటు వీలైనంత వరకు మానుకోవాలి. లేదంటే ప్రమాదకరం కాని పదార్థాలు తీసుకోవచ్చు.