బిగ్ బాస్ సీజన్ 6లో భాగంగా ఆట చివరి దశకి వచ్చేస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న అందరూ బలమైన కంటిస్టెంట్ లు ఉన్నారు. వీరిలో అందరూ కూడా టాప్ లోకి వెళ్ళగలిగే సత్తా ఉన్నవారే కావడం విశేషం. అయితే ఇకపై ఎలిమినేట్ కాబోయే పార్టిసిపెంట్ లు అందరూ కూడా స్ట్రాంగ్ కావడంతో బయట నుంచి విమర్శలు వస్తాయి. ఇది ఎప్పుడు ఉండేదే అలాగే ఈ సారి కూడా సీజన్ లో బలమైన పార్టిసిపెంట్ గా ఉంటూ మొదటి నుంచి ఫైర్ బ్రాండ్ గా ఫ్యాన్స్ తో అనిపించుకొని సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ని ఇనాయా సుల్తానా సొంతం చేసుకుంది.
దీంతో టాప్ 5 ఫైనలిస్ట్ లో ఆమె కూడా ఒకరుగా ఉంటుందని, కచ్చితంగా విన్నర్ లేదా రన్నర్ గా ఆమె ఉండే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అయితే ఉన్నపళంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఇనాయా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. ఊహించని విధంగా ఇనాయా ఈ వారం హౌస్ నుంచి వెళ్ళబోతుంది అనే మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆమె బయటకి రావడం అనేది కన్ఫర్మ్ అయిపోయిందనే టాక్ వినిపిస్తున్న నేపధ్యంలో సోషల్ మీడియాలో బిగ్ బాస్ పై విమర్శలు వస్తున్నాయి.
బలమైన కంటిస్టెంట్ గా ఉన్న ఇనాయాని ఎలిమినేట్ చేయడం ద్వారా బిగ్ బాస్ అంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె హౌస్ లో ఫైనలిస్ట్ లో ఒకరని, ఫైర్ బ్రాండ్ అని అంటున్నారు. అలాంటి పార్టిసిపెంట్ ని హౌస్ నుంచి పక్కా ప్లాన్ ప్రకారమే పంపించేస్తున్నారు అనే మాట వ్యక్తం అవుతుంది. వేరేవరినో విన్నర్ ని చేయడానికి ఇనాయాని తప్పించడం అస్సలు ఫెయిర్ కాదని ట్రోల్ చేస్తున్నారు. ఇలా అయితే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ని ఎవరూ చూడరు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఓటింగ్ ప్రకారమే ఇనాయాని ఎలిమినేట్ చేసారనే మాట కూడా వినిపిస్తుంది. మరి ఇందులో ఏది కరెక్ట్ అనేది ఎవరు చెప్పలేరు.