బిగ్ బాస్ సీజన్ 6లో ఆరంభం నుంచి ఓ నాలుగు వారాల పాటు ఇనాయా సుల్తానా అంటే ఎవరికి తెలియదు. ఆ నాలుగు వారాలలో మూడు సార్లు ఆమె ఎలిమినేషన్ లోకి వచ్చి డేంజర్ జోన్ నుంచి బయట పడింది. తరువాత నుంచి ఆమెకి ఊహించని స్థాయిలో ఆదరణ వస్తుంది. శ్రీహాన్ తో జరిగిన గొడవ తర్వాత ఇనాయా ఓటింగ్ అమాంతం పెరిగిపోయింది. ఏకంగా సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసింది. అప్పటి నుంచి ఈబ్యూటీ హవా నడుస్తూనే ఉంది. లాస్ట్ స్థానం నుంచి టాప్ 5 కంటిస్టెంట్ లలో ఒకరు అనే స్థాయికి ఇనాయా రావడం వెనుక ఆమె గేమ్ ఒకటి కారణం అయితే బయటి నుంచి అనూహ్యంగా ఆమెకి లభిస్తున్న మద్దతు కూడా ఒక రీజన్ గా ఉంది.
సూర్యతో ఆమె నడుపుతున్న లవ్ ట్రాక్ కారణంగా ఇనాయా మీద కొంత నెగిటివ్ ఉన్న ఓటింగ్ లో మాత్రం అది ప్రభావం చూపించలేదు. అలాగే హౌస్ లో శ్రీహాన్ తో జరిగిన గొడవలో ఫైనల్ వరకు ఉంటా, కప్పు కొట్టుకొని వెళ్తా అంటూ ఛాలెంజ్ కూడా చేసింది. అయితే ఇంత ధైర్యంగా ఆమె గేమ్ ఆడటానికి కారణం బయట ఆర్జీవీ నుంచి వస్తున్న మద్దతే అని తెలుస్తుంది.
ఆర్జీవీతో ఫోటోల కారణంగానే ఇనాయా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి బిగ్ బాస్ వరకు వచ్చింది. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఇనాయా సుల్తానకి సపోర్ట్ చేయాలని ఆర్జీవీ ట్విట్టర్ లో పోస్ట్ కూడా పెట్టారు. అలాగే ఆమె తరుపున క్యాంపైన్ కూడా చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. తాజాగా బిగ్ బాస్ మాజీ కంటిస్టెంట్ ఆషూరెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఇనాయాకి బయట నుంచి ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పింది. ఆ వ్యక్తి ఎవరనేది అందరికి తెలుసని కూడా కామెంట్స్ చేసినట్లు టాక్.