రెజీనా సంచలన వ్యాఖ్యలు
యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్ర ..SMS ( శివ మనసులో శ్రుతి) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది . ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్లింది. ప్రస్తుతం ఈ సుందరి తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో సినిమా లలో నటిస్తోంది. ఇన్నాళ్లు టాలీవుడ్ యంగ్ హీరోలతో కలిసి నటించిన హీరోయిన్ రెజీనా..ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరో..మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించింది.
![టాలీవుడ్ పై రెజీనా సంచలన వ్యాఖ్యలు 2 టాలీవుడ్ పై రెజీనా సంచలన వ్యాఖ్యలు](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-18T111446.798.jpg)
మెగాస్టార్ చిరు నటించిన మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ఆచార్య’లో స్పెషల్ సాంగ్ కి కూడా చేసింది రెజీన. ‘సానా కష్టం వచ్చిందే మందాకిని’ అనే సాంగ్ లో చిరుకు పోటీగా స్టెప్పులేసి అదరకొట్టేసింది రెజీనా కసాండ్ర. అయితే.. తాజాగా హీరోయిన్ రెజీనా కసండ్రా సంచలన వ్యాఖ్యలు వ్యక్తం చేసింది. తాను కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కు గురయ్యానని హీరోయిన్ రెజీనా కసండ్రా తెలియచేసింది . కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం చూస్తుండగా ఓ వ్యక్తి కాల్ చేసి….’అడ్జస్ట్మెంట్ కి ఓకే అంటే ఛాన్స్ ఇస్తా. వెంటనే షూటింగ్ కూడా మొదలు పెడదాం’ అని అన్నట్లు ఆమె వెల్లడించింది . అప్పుడు ఆమెకు అడ్జస్ట్మెంట్ అంటే తెలియదని… తన మేనేజర్ చెబితే తెలిసిందన్నారు. ఆ తర్వాత ఎప్పుడు తనకు అలాంటి అనుభవం ఎదురు కాలేదని అనారు .