RRR Team : దర్శకధీరుడు రాజమౌళి పుణ్యమా తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. వరుసగా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆర్‌ఆర్‌ఆర్‌కు అవార్డుల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ చిత్రం అంతర్జాతీయంగా హాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను కైవసం చేసుకుంది. ఒకటో రెండో కాదు ఏకంగా నాలుగు అవార్డులను సొంతం చేసుకుని ఆర్‌ఆర్‌ఆర్ సినిమా.

హాలీవుడ్ ను తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్ శాసిస్తోంది. ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్స్ , క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లను సొంతం చేసుకున్న ఈ సినమా తాజాగా లాస్ ఏంజిల్స్‌లో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌లో పెద్ద విజయాన్ని సాధించింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు అవార్డులను ఒకే వేదికపై సొంతం చేసుకుంది ఈ మూవీ. ఉత్తమ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్ , బెస్ట్ ఒరిజినల్ సాంగ్ వంటి 3 పెద్ద అవార్డులతో సహా ఈ చిత్రం ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నిలిచింది. ఆర్‌ఆర్‌ఆర్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ అవార్డు వేడుకకు సంబంధించిన పిక్స్ ను మేకర్స్ షేర్ చేశారు. సినిమా బృందంతో పాటు రాజమౌళి, రామ్ చరణ్, ఎం.ఎం.కీరవాణిలు అవార్డులతో దిగిన పిక్స్ ను పోస్ట్ చేశారు. #RRRMovie , #HCAFilmAwards అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ఈ ఫోటోలను పంచుకున్నారు.

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును స్వీకరిస్తూ, రాజమౌళి వేదికపై మాట్లాడారు, భారతదేశంలోని నా తోటి చిత్ర నిర్మాతలందరికీ, మనం నిజంగా అంతర్జాతీయ చిత్రాలను తీయగలమన్న నమ్మకం ఈ అవార్డు ద్వారా దక్కిందని అన్నారు. దానికి హెచ్‌సీఏ కు చాలా చాలా చాలా ధన్యవాదాలు జై హింద్ అని అన్నారు. అదే విధంగా ఈ చిత్రంలో అన్ని స్టంట్స్ ను అద్భుతంగా తీసేందుకు కృషి చేసిన నా కొరియోగ్రాఫర్‌కి నేను మొదట ధన్యవాదాలు చెప్పాలి అని అన్నారు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లలో స్టంట్ మాస్టర్, జుజీ సహాయం అందించారన్నారు. భారతదేశానికి వచ్చి మా విజన్‌ని అర్థం చేసుకున్న ఇతర కొరియోగ్రాఫర్‌లందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. వారు మా వర్కింగ్ స్టైల్‌కు అనుగుణంగా తమ వర్కింగ్ స్టైల్‌ని మార్చుకున్నారు అని తెలిపారు.

ఆర్‌ఆర్‌ఆర్ అద్భుతమైన నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మెజారిటీ స్టంట్స్ చేసారని కూడా వెల్లడించారు రాజమౌళి. ఈ విజయం టీమ్ మొత్తం కలిసి చేసిన కృషి. ఇందుకు నా టీమ్ మొత్తానికి ధన్యవాదాలు. 320 రోజులు కష్టపడి ఈ సినిమా తీశాం, చాలా వరకు స్టంట్స్‌తో తీశాం. ఈ గుర్తింపు నాకు , నా చిత్రానికి మాత్రమే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కూడా చాలా ముఖ్యమైనది. మరింత ఎగరడానికి ఈ రెక్కలు ఉన్నాయని ఆశిస్తున్నాను అని తన స్పీచ్ ముగించారు.