వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’
వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్ సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేశారు. ఈ చిత్రం తెలుగు – హిందీ భాషాలో తెరకేక్కనుంది. ఈ సినిమాకి ‘ఆపరేషన్ వాలెంటైన్” అనే అధికారిక టైటిల్ ను చిత్రా బృందం ఖరారు చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 8, 2023న విడుదల చేయాలని సినిమా యూనిట్ నిర్ణయించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇదే విషయాన్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేశారు.
![వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా టైటిల్ "ఆపరేషన్ వాలెంటైన్" 2 operation valentine](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/operation-valentine-5.png)
ఈ చిత్రం వాస్తవ కధనాలు ఆధారంగా రూపించటం జరుగుతుంది అని చిత్రా యూనిట్ తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం భారతాదేశంలోనే అతిపెద్ద ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రంగా నిలువనుంది. ఇందులో వరుణ్ తేజ్ IAF అధికారిగా కనబడబోతున్నారు మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. శక్తి ప్రతాప్ సింగ్ మాటలు మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ మరియు రినైసన్స్ పిక్చర్స్ భారీగా నిర్మాణం చేపడుతున్నారు కాగా టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.