Blood: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత రక్తం ఉండాలి. అవయవాలు సక్రమంగా పని చేయాలన్నా, మెదడు, గుండె సక్రమంగా పని చేయాలన్నా రక్త సరఫరా చాలా ముఖ్యం. సరైన మోతాదులో రక్తం ఉంటే శరీరం బాగా పని చేస్తుంది. ఏ యవసు వారికి ఎంత రక్తం ఉండాలనేది తెలుసుకోవాలి. శరీరంలోని రక్తం మొత్తం బరువు, వయసు, లింగంపై ఆధాపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలోని రక్తం అంతా కలిపి శరీర బరువులో సుమారు 7 శాతానికి సమానమట.
మన బరువు ఆధారంగా రక్తం ఎంత ఉందనేది అంచనా వేస్తారు. చాలా మంది రక్తదానం తర్వాత రక్తం తగ్గిపోతుందని భ్రమ పడుతుంటారు. కానీ అది నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. రక్తదానం చేశాక మూడు నెలల సమయం తీసుకుని శరీరం తగినంత రక్తాన్ని తయారు చేసుకుంటుంది. తర్వాత రక్తదానం భేషుగ్గా చేసుకోవచ్చు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరికి ఎంత రక్తం ఉండాలో తెలుసుకోవడం ముఖ్యం.
పెద్ద వారిలో అయితే ఎంత రక్తం ఉండాలంటే..
చిన్న పిల్లల శరీరం.. బరువులో కిలో గ్రాముకు 75 ml రక్తాన్ని కలిగి ఉంటుందట. 3.6 కిలోల బరువున్న శిశువుకు సుమారు 270 మిల్లీమీటర్ల రక్తం ఉంటుందట. శిశువు శరీరంలో 2,650 మి.మీ. రక్తం ఉంటే అప్పుడు బిడ్డ సంపూర్ణ ఆరోగ్యవంతమైన కేటగిరీలోకి వస్తారట. ఇక పెద్ద వారి విషయంలో.. ఎక్కువ రక్తం ఉండాలట. సుమారు 70 కేజీల బరువున్న వారిలో సుమారు 4,500 నుంచి 5,700 మి.మీ. రక్తం ఉండాలని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు.
Blood:
గర్భిణీ స్త్రీల విషయంలో మరింత శ్రద్ధ అవసరం. వారిలో 30 నుంచి 50 శాతం రక్తం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా వారి శరీర బరువు ఆధారంగా కొలుస్తారు. చాలా మందిలో రక్త హీనత జబ్బు ఉంటుంది. అలాంటి వారిలో గుండె చప్పుడు తగ్గడం, లో బీపీ, హై బీపీ రావడం, శ్వాస వేగంగా తీసుకోవడం, బలహీనత, మత్తు రావడం లాంటి లక్షణాలు వస్తాయి. అలాంటి వారు రక్తం బాగా పట్టే ఆహారం తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.