Cholesterol: ఈ మధ్య కాలంలో జనాలకి జంక్ ఫుడ్ తినడం ఒక అలవాటుగా మారిపోయింది. కూర్చున్న దగ్గరికే వచ్చి చేరుతుండడంతో బద్ధకం కూడా పెరిగిపోయింది. ఇలా ఏదో ఒక ఆప్ లో ఫుడ్ ని బుక్ చేసుకోవడం తినేయడం ఇదే అలవాటుగా మారిపోయింది. ఇలా ఆరోగ్యకరమైన వంటకాలకు ప్రజలు దూరమైపోయారు. ఇంట్లో కూర నచ్చకపోయినా, బద్దకంగా ఉన్నా ఆర్డర్ పెట్టు కోవాలి. బయటికి వెళ్లే ఆలోచన కూడా లేదు. ఇలా ఎక్కువగా బయటి ఫుడ్ తినడం వల్ల లేదా సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల ఒంట్లో కొవ్వు శాతం విపరీతంగా పెరిగిపోయి రకరకాల రోగాలను కొనితెచ్చుకుంటున్నారు.
ఈ కొలెస్ట్రాల్ సమస్య కూడా ఈరోజుల్లో కామన్ అయిపోయింది. అయితే శరీరంలో కొవ్వు శాతం పెరిగితే అనేక రోగాలను ఆహ్వానించిన వాళ్ళం అవుతాం. అయితే ఈ కొలెస్ట్రాల్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజూ ఈ పానీయాలు తీసుకుంటే మనం ఈ కొలెస్ట్రాల్ ని నియంత్రించవచ్చు. అయితే కొలెస్ట్రాల్ నియంత్రణ కు యోగా మరియు వ్యాయామం ఒక్కటే పరిష్కారం కాదు. కొన్ని పానీయాలను తీసుకోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ ని నియంత్రించవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
కాకరకాయ లో కొవ్వుని కరిగించే గుణాలు ఉంటాయి. కేవలం షుగర్ నియంత్రణకి మాత్రమే కాదు. కాకరకాయని రోజు తీసుకుంటే ఈ కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది. అలాగే పొట్లకాయ పీచు, విటమిన్ ఏ,కె, ఇ లు ఉంటాయి. కాబట్టి ఈ పొట్లకాయ రసం కూడా కొలెస్ట్రాల్ నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
Cholesterol:
బీట్ రూట్ ని ఎక్కువగా సలాడ్ రూపంలో తీసుకుంటూనే ఉంటారు. కానీ ఈ బీట్ రూట్ చర్మం మెరిసిపోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫాస్పరస్, విటమిన్ బి వంటివి ఉంటాయి. కావున ఈ బీట్ రూట్ రసాన్ని రోజు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.