Depression : చాలా మంది ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య డిప్రెషన్. ఎవరైనా ఏదైనా కోల్పోయినా, మనసు నొచ్చుకునేలా మాట్లాడినా, ఎవరితోనైనా గొడవ పడినా, మనకు నచ్చింది దక్కకపోయినా, అనుకున్నది అవకపోయినా, ఏదైనా ప్రాణాంతక వ్యాధి బారిన పడినా మనలో మానసిక ఒత్తిడి మొదలవుతుంది. క్రమంగా ఇది దీర్ఘకాలిక రుగ్మతగా మారుతుంది. కొన్ని రకాల మందులు ఎక్కువ కాలం వాడడం, సామాజిక అంశాలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి కూడా తీవ్రమైన స్ట్రెస్ కి గురి చేస్తాయి. దీనికి బాహ్య కారణాలే కారణమని భావిస్తుంటాం. కానీ మెదడులోని రసాయనాలు హెచ్చుతగ్గులకు లోనవడం వల్లనే ఈ రుగ్మత తలెత్తుతుంది.
Depression : ఒత్తిడిని జయించేందుకు చాలా మందులున్నాయి..
వంశపారంపర్యం, నిద్రలేమి, తీవ్ర వ్యాధులు, పోషక లోపాలు మొదలైనవి కూడా డిప్రెషన్‌కు కారణాలే.. అలాగే చదువు, వ్యక్తిగత అనుబంధాలు, ఒత్తిడిలు కూడా డిప్రెషన్‌కు గురి చేస్తూ ఉంటాయి. కారణాలేవైనా సరే.. డిప్రెషన్ కి గురైతే మానసికంగా చిత్తు కావడమే కాకుండా క్రమేపీ మరణం అంచుకు కూడా చేరుకోవడం జరుగుతుంటుంది. ఈ ఒత్తిడిని జయించేందుకు చాలా మంది మందులు కూడా ఉపయోగిస్తుంటారు. ఈ మందులతో పాటు జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేయడంతోపాటు మన మైండ్‌ని మనకు నచ్చినట్టు ట్యూన్ చేసుకోగలిగితే ఈ ఒత్తిడి మన దరిదాపుల్లోకి కూడా రాలేదు. ప్రతి సమస్యకూ మంచి చెడూ రెండు ఉంటాయి. చెడును పక్కనబెట్టి.. మంచిని మాత్రమే తీసుకోగలిగితే చాలు.. మానసికంగా మనం ధృడంగా ఉన్నట్టే.
అయితే ఎలాంటి నిరాశానిస్పృహలకైనా కొన్ని ఆయుర్వేద ఔషధాలు మెదడుకు టానిక్‌లా పని చేసి, చురుకుదనాన్ని పెంచి, డిప్రెషన్‌ను పారదోలతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
జటామానసి: జటామానసి వేరు మానసిక స్థితిని సరిదిద్దుతుంది. ఆందోళన, డిప్రెషన్‌తోపాటు ఇతరత్రా మానసిక వ్యాధులకు ఇది మంచి మందు.
బ్రహ్మి: ఈ మూలిక జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పసికందుల్లో మెదడు ఎదుగుదలకు తోడ్పడే ఈ మూలిక, ఆందోళన, ఒత్తిడి, నరాల సమస్యలను సైతం నివారిస్తుంది. తలనొప్పులకు ఇది దివ్యౌషధం.
శంకపుష్టి: నరాల బలహీనతకు చక్కని మందు ఇది. మొద్దుబారిన మెదడును ఉత్తేజపరిచే గుణం ఈ ఔషధానికి ఉంది.