Monkey Fox : ప్రస్తుతం ప్రపంచ దేశాలను మంకీపాక్స్ కలవరపెడుతోంది. తాజాగా భారత్‌కు కూడా విస్తరించింది. ఇటీవలే కేరళలో ఒక కేసు కూడా నమోదైంది. యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఓ ప్రయాణికుడిలో మంకీపాక్స్ లక్షణాలను గుర్తించారు. అతడి నమూనాలు సేకరించి పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపించగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక ఒక్క కేసు ఎంతలా విజృంభిస్తుందోనని భారత్‌లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏంటీ మంకీ పాక్స్? దీని లక్షణాలు ఏంటి?
Monkey Fox :మంకీ పాక్స్ అంటే ఏమిటి..?
మంకీపాక్స్ ఒక వైరల్ డిసీజ్. మంకీపాక్స్ స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. ఇది జూనోటిక్ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం కూడా ఉంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 1970ల్లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
ఎలా వ్యాపిస్తుంది..? లక్షణాలేంటి?
వాస్తవానికి మంకీ పాక్స్ వ్యాధి సోకిన జంతువు గాయాన్ని తాకినా, సంపర్కరం, కాటు కారణంగా సోకే అవకాశం ఉంది. ప్రస్తుతం నమోదయ్యే కేసులు మాత్రం ఎక్కువగా మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్నాయి. లైంగిక సంపర్కం ద్వారా మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉంది. జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి ఈ వ్యాధి లక్షణాలు. స్మాల్‌పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. అయితే మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే ఈ వ్యాధి అరుదుగా ప్రాణాంతకంగా మారుతుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
మంకీపాక్స్‌కు చికిత్స ఉందా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
మంకీపాక్స్‌కు కచ్చితమైన చికిత్స అనేది లేనప్పటికీ, ఈ వ్యాధిని నియంత్రించడానికి వైద్యులు యాంటీవైరల్ మందులను సూచిస్తున్నారు. స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్, మంకీపాక్స్ చికిత్సలో 85% సమర్థవంతగా పనిచేస్తుంది. కొవిడ్ సమయంలో మనం అనుసరించిన జాగ్రత్తల మాదిరిగానే, నిపుణులు సామాజిక దూరం, మాస్క్, మెరుగైన వెంటిలేషన్ వంటి వాటి ద్వారా మంకీపాక్స్‌కు అనుసరించాలి. అనుసరించాలని సూచిస్తున్నారు. మంకీపాక్స్ ధ్రువీకరించిన వ్యక్తులకు, అనుమానిత వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.
రద్దీగా ఉండే ప్రాంతాలకు, కార్యక్రమాలకు వెళ్లడం మంచిది కాదు.