Redmi note 12: ఇండియన్ మార్కెట్లోకి రెడ్ మీ కొత్త ఫోన్లు వస్తున్నాయి. రెడ్ మీ నోట్ 12 సిరీస్ ఫోన్లు రిలీజ్ కాబోతున్నాయి. వీటిని ఇప్పటికే షావోమీ తన సొంత దేశమైన చైనాలో విడుదల చేసింది. ఇందులో రెడ్ మీ 12, రెడ్ మీ 12 ప్రో, రెడ్ మీ 12 ప్రో ప్లస్.. ఇలా మూడు రకాల ఫోన్లు విడుదలయ్యాయి. చైనా మార్కెట్లో వీటి ధరలు రూ.13,600 నుంచి మొదలవుతాయి. రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ హై ఎండ్ వేరియంట్ ధర రూ.30 వేలు.
అయితే, ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేసేదీ కంపెనీ ప్రకటించలేదు. చైనాలో విడుదలయ్యాయి అంటే త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెడ్ మీ 12 వేరియంట్ 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తుంది. 120 హెర్డ్ రీఫ్రెష్ రేటు, స్నాప్ డ్రాగన్ 4 జనరేషన్ 1 ఎస్ వోసీ తో ఇది వర్క్ చేస్తుంది.
బ్యాటరీ, ఇతర ఫీచర్లు ఇవే..
ఇందులో బ్యాటరీ 5 వేల ఎంఏహెచ్ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తోంది. బాక్ సైడ్ 48 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. రెడ్ మీ 12 ప్రోలో 6.67 ఇంచుల ఓఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెడ్జ్ రీఫ్రెష్ రేటు ఉన్నాయి. మీడియా టెక్ 1080 చిప్ సెట్ తో ఇది వర్క్ చేసేలా డిజైన్ చేశారు.
బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఫిట్ చేశారు. 50 మెగాపిక్సెల్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగా పిక్సెల్ క్యామ్ ఉంది. ఇక రెడ్ మీ 12 ప్రో ప్లస్ వేరియంట్ 6.67 ఇంచుల డిస్ ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో అందుబాటులో ఉంది. ఇందులో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ అదనంగా ఉంటుంది.