Apple Cider Vinegar : శరీరం కాంతివంతంగా ఉండాలని.. మన కురులు ఆరోగ్యంగా పెరగాలని ఎవరికి ఉండదు చెప్పండి. దీనికోసం రకరకాల లోషన్లు, ట్యాబ్లెట్స్, ఇతర మార్గాలెన్నో ప్రయత్నిస్తుంటాం. ఇక మార్కెట్లో కూడా సౌందర్య సాధనాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అయితే కనపడిందల్లా వాడితే కురుల పెరుగుదల, మేని సౌందర్యం మాటేమో కానీ అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉంది. అయితే మరి అద్భుతంగా పని చేసే ఔషధమంటూ ఏదీ లేదా? అంటే.. ఉన్నాయి. కానీ అది అంత అద్భుతంగా పని చేస్తుందని మనకు తెలియదు. అదేంటంటే యాపిల్ సిడర్ వెనిగర్.
Apple Cider Vinegar : అద్భుతమైన టోనర్..
యాపిల్ సిడర్ వెనిగర్ బరువును తగ్గించడానికే కాదు.. మరెన్నో రకాలుగా పని చేస్తుంది. అయితే దీనిని తీసుకోవడం కాసింత కష్టం అయినా సరే.. తీసుకుంటే మాత్రం ఇదొక అద్భుత ఔషధం. యాపిల్ సిడార్ వెనిగర్‌లో రక్తస్రావాన్ని అరికట్టే సహజసిద్ధమైన గుణం ఉండడంవల్ల ఇది ఒక అద్భుత టోనర్‌లా పనిచేస్తుంది. 1:1 నిష్పత్తిలో యాపిల్ సిడార్ వెనిగర్‌కు నీటిని కలిపి ఓ స్ర్పే బాటిల్లో పోయండి. దీన్ని నేరుగా చర్మంపై స్ర్పే చేసుకోవచ్చు. లేదంటే కాటన్ ప్యాడ్‌తో అయినా అప్లయ్ చేయవచ్చు. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు… చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలను నివారిస్తాయి.
చర్మం కాంతివంతమవడానికి.. యాపిల్ సిడార్ వెనిగర్‌లోని మాలిక్ యాసిడ్ అద్భుతంగా పని చేస్తుంది. ఇది డెడ్ స్కిన్‌ను నిర్మూలిస్తుంది. చేతులు, కాళ్లపై ఈ వెనిగర్ వేసి సున్నితంగా రుద్దితే డెడ్ స్కిన్ మాయమై.. చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు.. మొటిమలను కూడా నివారిస్తుంది. పడుకొనే ముందు దూదిని ఈ వెనిగర్‌లో ముంచి, మొటిమలపై రాస్తే తెల్లవారేసరికి మొటిమలు కనిపించవు. ఇక యాపిల్ సిడార్ వెనిగర్, నీరు సమపాళ్లలో కలిపిన మిశ్రమంతో జుట్టును శుభ్రం చేయాలి. లేదంటే షాంపూలో కలిపి అయినా వాడుకోవచ్చు. ఇదొక కండీషనర్‌గా పని చేయడమే కాకుండా.. జుట్టును మృదువుగా చేయడంలోనూ ఇది తోడ్పడుతుంది.