weight loss : బరువు తగ్గించుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి? దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక వైపు వ్యాయామం, మరోవైపు ఆహార విషయంలో మార్పులు చేస్తారు. అయినా తగ్గరు. దీనికి కారణం ఒక క్రమ పద్ధతిలో డైట్ పాటించకపోవడమే. అలాగే ఏవి తినాలి? ఏవి తినకూడదనే విషయాల్లో అవగాహన లేకపోవడం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, కేకులు, కుకీస్ వంటి ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదని మనందరికీ తెలుసు. వీటిని ఎక్కువగా తింటే.. ఊబకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతారు. అయినప్పటికీ, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ వీటిని చాలా ఇష్టపడతారు.
weight loss : 600 కేలరీలు ఉన్న కేక్ తింటే బరువు తగ్గుతారట..
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో 600 కేలరీలు ఉన్న కేక్ తింటే బరువు తగ్గుతారట. వినడానికి వింతగా ఉన్న ఇది ఓ అధ్యయనంలో తేలిన నిజం. ఎడారి ప్రాంతానికి దూరంగా ఉండే వారు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. కేక్ తినడం ద్వారా, ఆహారం తినాలనే కోరిక తగ్గిందని, తద్వారా బరువు తగ్గారని అధ్యయనం వెల్లడించింది. అయితే కొందరు నిపుణులు మాత్రం ఆశ్చర్యకర విషయాలను వెల్లడించారు. ఆరోగ్యానికి మంచిది కాదని అనుకునే.. పిజ్జా, బర్గర్లు.. మన ఆరోగ్యానికి మేలు చేస్తాయట. నిజంగా ఇది అవాక్కయ్యే విషయమే కదా. అయితే వీటిని సరైన పద్ధతిలో చేస్తే మాత్రమే ఆరోగ్యం.
ఈ ఆహార పదార్థాలను మైదాతో పాటు కూరగాయలు, నెయ్యి, చీజ్‌తో తయారు చేస్తారు. ఇవన్నీ అవసరమైన మేరకు వాడితే చాలా ఆరోగ్యమని నిపుణులు చెబుతున్నారు. అతి ఎప్పుడూ అనర్ధమే కదా. ఒక నివేదిక ప్రకారం పిజ్జాలో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. పిజ్జా తయారు చేయడానికి టమాటా చట్నీ వాడతారు. టమాటాలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. పిజ్జా పిండిలో వేసే ఈస్ట్ రియాక్షన్ కారణంగా.. పిజ్జా డౌలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పిజ్జాలో చాలా రకాల కూరగాయలు వేస్తారు. ఇవి ఆరోగ్యానికి మంచి చేస్తాయి. కానీ పిజ్జాను గోధుమ పిండితో తయారు చేస్తే మరింత ఆరోగ్యం.