ఓ వైపు తండ్రి గురించి చెప్పమని దేవి చీటికి మాటికి రాధతో గొడవ పడుతూ ఉంటుంది. తండ్రిని వెతికి పెట్టమని ఆదిత్యకు వేడుకుంటూ.. ఎలాగైనా అతన్ని కొట్టాలని ఆదిత్య మనసుని బాధ పెడుతుంది దేవి. ఆదిత్య కొట్టడం వల్ల మాధవ కాలు విరిగింది అని చెబుతుంటాడు. కానీ గత ఎపిసోడ్ లో రిసార్ట్ లో ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న మాధవ్ కర్ర సహాయం లేకుండానే చాలా బాగా నడుస్తూ ఉంటాడు. అంటే ఇప్పటి వరకు అతను నటించాడు అని అర్థం అవుతోంది. మెయిన్ విలన్ ఎంట్రీతో కథ ఇంకా రసవత్తరంగా మారింది. ఇక ఆగస్టు 6న ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
మాధవ ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతుంటారు ఫ్రెండ్స్. అప్పుడే చాలా స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తుంటాడు మాధవ. అది చూసి ఎంట్రా ఒక చోట ఉండట్లేదు అంటే.. ఒకే దగ్గర కూర్చోడానికి రిసార్ట్ కి రావడం ఎందుకు రా అంటాడు మాధవ. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్దమవుతాడు.’రేయ్ మాధవ.. ఎక్కడికిరా’ అని మాధవ స్నేహితులు అడ్డుపడితే.. ‘ఇంటిని మిస్ అవుతున్నా ఫీలింగ్ వస్తోంది రా.. ఇంటికి వెళ్లాలి’ అంటాడు మాధవ. ‘బెంగ ఇంటి మీదా.. అక్కడ ఉన్న రాధ మీదా?’అంటూ నవ్వుతారు స్నేహితుల్లో ఒకడు. ఇంతలో మరొకడు.. ‘రేయ్.. ఎవరైనా అమ్మాయిల వెంట పడతారు.. నువ్వేంట్రా బాబు.. పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న ఆంటీనీ ప్రేమిస్తున్నావు’ అనడంతో అందరూ నవ్వుతారు. ఆ మాటలకి చిర్రెత్తుకొచ్చిన మాధవ బ్లాక్ షర్ట్ వాడిని లాగిపెట్టి కొడతాడు.
‘అది ప్రేమ కాదు.. నా ప్రేమ కాదని అని పంతం.. నాకు కావాలి అనుకున్నది దక్కించుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. చాలా ఎలా తపస్సు తర్వాత ఒక మంచి అమ్మాయి దొరికిందని సంతోషపడి నా ప్రేమని చెబితే.. చాలా సింపుల్ గా నో అనేసింది. నాకెంతా కోపం రావాలి. దాని కోసం ఇప్పుడు దాని మొగుడు ఆదిత్య తిరుగుతున్నాడు. నా పంతం మరింత రెట్టింపు అయ్యింది. అలాంటప్పుడు దానికి టాటా చెప్పి పంపిస్తానా? రాధ ఎప్పటికీ నాదే.. ఆ ఆదిత్య కాదు కదా.. ఎవ్వరు వచ్చినా రాధని వదిలే ప్రసక్తే లేదు.. రాధని నా దాన్ని చేసుకునేదాకా.. నిద్రపోను.. అయినా ఆంటీని కాకుండా అమ్మాయిని ప్రేమించడానికి నేనేమైనా కాలేజ్ స్టూడెంట్నా? నువ్వు ఆ మాట అన్నందుకు కొట్టలేదురా.. వీళ్లు నవ్వినందుకు కొట్టాను.. సరే మనసులో ఏం పెట్టుకోకు’ అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. ‘రేయ్ మాధవ.. స్టిక్ మరిచిపోయావ్రా’ అంటాడు మరో స్నేహితుడు. దాంతో కర్ర తీసుకున్న మాధవ దాని సహాయంతో కుంటుకుంటూ వెళ్తాడు. అది చూసి మాధవ ఫ్రెండ్స్ బిత్తరపోతారు.
ఇంటి దగ్గర రాధ పూలు కోస్తూ.. ఎలాగైనా మాధవ లేని ఈ రెండు రోజుల్లో దేవి మనసు మార్చి.. తనని అదిత్యకి దగ్గర చేయాలని అనుకుంటుంది. అదే సమయంలో కారులో ఎంట్రీ ఇస్తాడు మాధవ. దీంతో రాధ టెన్షన్ పడుతుంది. ఆమె దగ్గరకి వచ్చి.. ‘ఎలా ఉన్నావు రాధా.. నేను వస్తానని ఊహించలేదు కదా. కానీ రాగానే నిన్ను ఇలా ఎదురుగా చూడడం చాలా ఆనందంగా ఉంది’ అని వెటకారంగా అంటాడు మాధవ. దానికి.. నువ్వు లేకపోతే చాలా సంతోషంగా ఉన్న.. ఇప్పుడే బాధ మొదలైంది అంటుంది. ఈ రెండు రోజులు.. ఈ రెండు రోజులు నువ్వేం చేశావో నేను చెప్పానా అంటూ రాధ చేసింది అంతా మొత్తం చెబుతాడు మాధవ. రాధ షాక్ అవుతుంది. ‘దేవిని కరాటేలో చేర్పించావు.. నన్ను కొట్టించడానికేనా.. కానీ నువ్వు నేర్పించిన కరాటేతో నీ మొగుడ్నే కొట్టేలా దేవిని నేను తయారు చేశా’అంటూ క్రూరంగా మాట్లాడతాడు మాధవ. దాంతో రాధ ఆవేశంతో అతన్ని ఏదో అంబోతుంది. అంతలోనే దేవి నాయనా అంటూ మధవని కౌగిలించుకుంటుంది. ‘దేవి నిన్ను ఓ చోటికి తీసుకుని వెళ్తాను. మీ అమ్మని కూడా రమ్మను’ అనడంతో.. అసలు నిజం తెలియని దేవి అమాయకంగా రాధని బలవంతంగా కారులో ఎక్కిస్తుంది.
అక్కడేమో సూరిని వాళ్ల అన్నయ్య తిడుతూ ఉంటాడు. ఇలా గాలికి తిరగపోతే ఏదైనా పని చేయొచ్చు కదరా అని బుద్ది చెబుతూ ఉంటాడు. దానికి సూరి.. వదినమ్మ బాధ చూడలేక రుక్మిణీ కోసం తిరుగుతున్నా. ఎలాగైనా పట్టుకుంటా.. కానీ నేను ఆ అమ్మాయిని చూసి దగ్గరకి వెళ్లేలోపే ఊరిజనం అమ్మాయిల కోసం వచ్చాను అనుకుని తరుముతున్నారు అని వాపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన దేవుడమ్మా.. అవునండీ.. రుక్మిణీ దగ్గరలో ఉందని ఒకరు చెప్పారు.. చూశామని ఇంకొకరు చెప్పారు.. చూసి పట్టుకోలేకపోయామని మరొకరు చెప్పారు.. ఇప్పుడు సూరి కూడా చెబుతున్నాడు అంటే నిజమే అయ్యి ఉంటుంది. నేను ఒకసారి వెళ్లి చూసొస్తా అంటుంది భర్తతో. అక్కడే ఉన్న సత్య అది విని షాక్ అవుతుంది. అక్క గురించి తెలియకూడదు అనే కదా ఆదిత్య, తను ఆమె గురించి వీళ్లకు చెప్పలేదు. ఇప్పుడు ఆంటీకి తెలిస్తే ఏమైనా ఉందా అని భయపడుతుంది. అందుకే.. ‘ఆంటీ మీరు ఆఫీసర్ గారి తల్లి. మీరు అలా ఊర్లో తిరగడం ఎంత చిన్నతనం. అయినా ఆ అమ్మాయి గురించి ఎందుకు వెతుకుతున్నారు అంటే ఏం చెబుతారు. అందుకే మీరు వెళ్లొద్దు. మీ కోసం ఆదిత్య వెతుకుతాడు’ అని చెబుతుంది సత్య. దాంతో తానే స్వయంగా వెళ్లలనే అలోచనని విరమించుకుంటుంది దేవుడమ్మ.
తీరా కారు ఎక్కిన తర్వాత.. నాయనా మనం ఎక్కడికి పోతున్నాం అని అడుగుతుంది దేవి. దానికి నీకు చాలా ఇష్టమైన చోటికే వెళుతున్నాం. అక్కడికి వెళ్లాక నువ్వు కచ్చితంగా సంతోషపడతావు అంటాడు మాధవ. దానికి.. మధ్యలో ఆఫీసర్ సారుని కల్లుద్దాం అంటుంది దేవి. మనం వెళ్లేది మీ ఆఫీసర్ ఇంటికే అని చావు కబురు చల్లగా చెబుతాడు మాధవ. అది విని షాక్ అవుతుంది రాధ. అదేం వద్దు వెనక్కి వెళదాం అని రాధ అంటున్నా వినకుండా.. ఆదిత్య వాళ్ల ఇంటికే కారుని పోనిస్తుంటాడు మాధవ. ఇంకపై రాధే.. రుక్మిణీ అని దేవుడమ్మకి తెలిసిపోతుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..