కార్తీక దీపం సీరియల్ మొదటి భాగంలో కార్తీక్, దీపకి టీవీ ప్రేక్షకులల్లో డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వారు చనిపోయారని తెలియగానే చాలామంది బాధ పడ్డారు. అప్పటి నుంచి వారి పాత్రలు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాయని వార్తలు ప్రచారం జరగుతోంది. వాటిని నిజం చేస్తూ గత ఎపిసోడ్లో గత కొన్నేళ్లుగా కోమాలో ఉన్న దీప మేల్కొంది. లేవగానే ఆమె నోటి నుంచి వచ్చిన పదం డాక్టర్ బాబు అని. తన భర్త కోసం ఆసుపత్రి మొత్తం తిరుగుతుంది. అది చూసిన డాక్టర్ ఆమె వచ్చిన రోజే ఓ శవం వచ్చిందని చెప్పి దీపని మార్చురీకి తీసుకెళ్లతాడు అక్కడే ఉన్న డాక్టర్. అక్కడికి వెళ్లగానే యాక్సిడెంట్ జరిగిన రోజు కార్తీక్ వేసుకున్న షూస్ వేసుకున్న ఆ శవం దగ్గర ఉంటాయి. అది చూసి షాక్ అవుతుంది దీప. ఆ తర్వాత ఆగస్టు 16న ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..
డాక్టర్ బాబుని తలచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది దీప. ‘డాక్టర్ బాబు ఏం అయ్యి ఉంటారు? ఆ రంగురాళ్ల వాళ్లకి నేను దొరికినట్లే.. నా డాక్టర్ బాబు ఎందుకు దొరకలేదు..? లేదు.. డాక్టర్ బాబు ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండి ఉంటారు.. మరి ఇన్ని రోజులు.. నా కోసం ఇక్కడికి ఎందుకు రాలేదు..? నేను ఇక్కడ ఆయన కోసం కంగారు పడుతున్నట్లు నాకోసం ఎక్కడ ఎంత కంగారు పడుతున్నారో?’ అంటూ బాధపడుతుంటుంది. మనుషులను దూరం చేయడం ఏం ఆట అంటూ దేవుడిని నిందిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వస్తాడు అప్పటివరకూ దీపకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్. ఆయన అన్నయ్య అని పిలుస్తూ జరిగిన గతాన్ని చెబుతుంది. అనంతరం డాక్టర్.. ‘‘కంగారు పడొద్దమ్మా.. మామూలుగా అయితే నీకు వైద్యం చేశాను.. నా పని అయిపోయింది. కానీ మీ ఆయన ఒక డాక్టర్ అంటున్నావ్.. నోరారా అన్నయ్యా అని పిలిచావ్.. కాబట్టి నీ అన్నగా ఈ విషయంలో నీకు అండగా ఉంటాను’ అంటాడు డాక్టర్. దీప పైకి లేచి నిలబడుతుంది. ‘ఈ ఒక్క సాయం చేయండి అన్నయ్యా.. డాక్టర్ బాబుని కలిసేలా చూడండి.. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అంటుంది దీప దన్నం పెడుతూ. ‘చూడమ్మా అన్నా చెల్లెల్లు అన్నాక ఇంకా ఈ రుణాలేంటమ్మా’ అంటాడు డాక్టర్. అనంతరం దీపని సముదాయించి మార్చురీకి తీసుకెళతాడు ఆ డాక్టర్.
అక్కడి వెళ్లిన దీపకి యాక్సిడెంట్ రోజు కార్తీక్ వేసుకున్న షూస్ కనిపిస్తాయి. దాంతో భయంగా ఆ శవం కార్తీక్‌ది కాకూడదని దేవుడిని వేడుకుంటుంది దీప. అనంతరం శవం మీద ఉన్న గుడ్డని తీస్తాడు డాక్టర్. కానీ అది చూడడానికి భయపడుతుంది దీప. ఆయన అయ్యిండడమ్మా అంటూ దీపని సముదాయిస్తాడు డాక్టర్. కానీ డాక్టర్ కూడా కార్తీకేనేమోనని భయపడుతుంటాడు. దీప భర్త కాకూడదని కోరుకుంటూనే దీపకి శవాన్ని చూపిస్తాడు. భర్తకి తనకి ఉన్న బంధం గురించి ఆలోచిస్తూ ఆ శవాన్ని చూసి కార్తీక్ కాదని చెబుతుంది దీప. అనంతరం దీప మనసు కూదుటపడుతుంది. ఆ తర్వాత ఆయన కచ్చితంగా క్షేమంగా ఉంటారు కదా అని డాక్టర్ని అడుగుతుంది దీప. అప్పుడు.. ‘కచ్చితంగా నీ భర్త ఎక్కడో క్షేమంగానే ఉండి ఉంటాడు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏ ప్రమాదం జరిగిన శవాలు వచ్చేది ఈ హాస్పిటల్‌కే. ధైర్యంగా ఉండు.. పదా ఇంటికి వెళ్దాం’ అని డాక్టర్ చెప్పి దీపని తన ఇంటికి తీసుకుని వెళతాడు.
ఇప్పటి వరకూ బేబీ రౌడీనే చూపించారు కదా. ఇప్పుడు అమాయక పిల్ల చిన్న హిమని కూడా రంగంలోకి దింపారు. యాక్సిడెంట్లో కొడుకు, కోడలు చనిపోయారని దిగులుగా ఉంటారు ఆనందరావు, సౌందర్య. ‘ఈ ఇంట్లో అన్ని అపశకునాలే జరిగాయి. మొదట వాడు పెళ్లి చేసుకుంటాడంటే నాకు నచ్చలేదు. తర్వాత మోనిత వారి జీవితాలను అతలాకుతలం చేసింది. తర్వాత అన్ని సర్దుకుంటాయనుకుంటే అంతోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. అందుకే అమెరికా వెళ్లిపోదాం’ అని అంటుంది సౌందర్య. అది విని.. ‘నేను రాను నాన్నమ్మా.. అందరం వెళ్లిపోతే సౌర్య పరిస్థితి ఏంటి.. సౌర్యని జాగ్రత్తగా చూసుకుంటానని అమ్మానాన్నకి మాటిచ్చాను. అలాంటిది కనీసం చూసే అవకాశం లేకుండా వెళ్లిపోదామంటే ఎలా’ అని ఎమోషనల్ అవుతుంది హిమ.
అప్పుడు.. ‘నా కొడుకు చనిపోయాడు. నా రక్తం ఎలాగో దూరమైపోయింది. అలాంటప్పుడూ వాడి రక్తాన్ని ఎలా దూరం చేసుకుంటాను. అందుకే సౌర్య గురించి వెతుకుదాం. త్వరలో తను కూడా మన దగ్గరకే వస్తుంది’ అని హిమని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది సౌందర్య. అలా కాదు.. తను వచ్చినప్పుడే అందరం కలిసి వెళదామంటూ మారాం చేస్తుంది హిమ. ‘ఇప్పటికే ఈ ఇంటి వల్ల చాలా నష్టాలు జరిగాయి. అందుకే సౌర్య కూడా దూరమై ఉంటుంది. అందుకే ఈ ఇంటిని అమ్మేద్దాం’ అని అంటుంది సౌందర్య. దాంతో.. ‘సరే సౌందర్య వెళ్లిపోదాం. మనశ్శాంతిని దూరం చేసుకుంటూ ఇక్కడ ఉండడం కంటే వెళ్లిపోవడమే మంచిది. మీ నాన్నమ్మా సౌర్యని తీసుకొస్తుంది’ అని అంటాడు ఆనందరావు. అనంతరం దీపని తన ఇంటికి తీసుకెళ్లిన డాక్టర్ ఆమెని తన తల్లికి పరిచయం చేస్తాడు. దీప ఎప్పటిలాగే చీరతో మెడలో తాళిబొట్టుతో కళకళలాడిపోతుంటుంది. డాక్టర్ తల్లి దీపని తన సొంత కూతురుగా భావిస్తూ ఉంటుంది. దీప రాగానే చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.