ముకుందతో పెళ్లికి ఆదర్శ్ కుటుంబం ఓకే చెప్తుంది కానీ ముకుంద మాత్రం మురారి ఫోన్ కోసం ఎదురుచూస్తుంటుంది. చివరకు తనే ఫోన్ చేస్తుంది కానీ శివన్న తాలూకూ మనుషులేమోనని రూడ్‌గా మాట్లాడతాడు మురారి. దాంతో మురారిని తప్పుగా అర్థం చేసుకుంటుంది ముకుంద. తనని నమ్మి మోసపోయానని బాధపడి తల్లిదండ్రులు చూసిన పెళ్లికి ఓకే చెప్తుంది. ఆ తర్వాత నవంబర్ 26 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..
శివన్న కృష్ణని దారిలో ఏడిపిస్తాడు. అపుడే మురారి వచ్చి శివన్నకు క్లాస్ పీకుతాడు. ముకుందకు తన మీద ఉన్న భయంతో తననేమి చేయలేడని ఫీలవుతాడు శివన్న. ఈ అమ్మాయి నీ మీద కంప్లైంట్ ఇవ్వకపోయిన నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపడం పక్కా అని గన్ పెడతాడు మురారి. దాంతో శివన్నలో సైలెంట్ అయిపోతాడు. కృష్ణని తీసుకుని వెళ్లిపోతాడు ఏసీపీ మురారి. దాంతో మురారి మీద కోపంతో రగిలిపోతాడు శివన్న.
ఆ తర్వాత సీన్లో ఆదర్శ్, ముకుందలు కలిసి కాఫీ తాగుతారు. వెడ్డింగ్ కార్డ్‌ని ముకుందకు చూపిస్తాడు ఆదర్శ్. నచ్చిందని చెప్తుంది ముకుంద. ఇక నచ్చాల్సిన వాడు ఒకడున్నాడు అంటూ మురారికి వీడియోకాల్ చేస్తాడు ఆదర్శ్. ఎలా ఉన్నావ్ రా అంటూ పలకరింపులు జరుగుతాయి. ఈ వెడ్డింగ్ కార్డు ఎలా ఉందంటూ మురారికి చూపిస్తాడు ఆదర్శ్. బాగుందని చెప్పి తనకు కాబోయే భార్య గురించి చెప్తాడు. ఎలాగు అక్కడే ఉంది కాబట్టి నాకు కూడా చూపించురా అంటాడు మురారి. చూపించడం కాదు మాట్లాడిస్తారా అంటూ ముకుందకు మురారి గురించి గొప్పగా చెప్పి ఫోన్ ఇస్తాడు ఆదర్శ్. తను చూడబోయే లోపే నువ్ ఇంతవరకు రాలేదు కాబట్టి పెళ్లి వరకు చూపించనని అంటాడు ఆదర్శ్. నువ్ రాకపోతే పీటల మీద పెళ్లి కూడా ఆపేస్తానంటూ ఫోన్ కట్ చేస్తాడు. మేమిద్దరం ప్రాణ స్నేహితులమే కాదు అంతకంటే ఎక్కువ అని మురారి గురించి గొప్పగా చెప్తాడు ఆదర్శ్.
ఆ తర్వా సీన్లో ఏసీపీ మురారి చంద్రశేఖర్ ఇంటికి లంచ్‌కు వెళ్తాడు. కృష్ణ ఏసీపీ మీద ఉన్న కోపంతో చికెన్‌లో కారం ఎక్కువ వేస్తుంది. అంతలోనే మురారి వస్తాడు. సుందరి వడ్డిస్తుంటే నేను వడ్డిస్తానంటుంది కృష్ణ. నువ్ మాతోపాటే తినాలని అంటాడు మురారి కృష్ణని. చికెన్ వద్దంటాడు మురారి. నేను ఈ రోజు నాన్ వెజ్ తినని చెప్తాడు. దాంతో ముకుంద కంగుతింటుంది. మా అమ్మాయి చికెన్ లవర్ అని చెప్తాడు చంద్రశేఖర్. నీకిష్టమైనంత తినమని సూచిస్తాడు మురారి. దాంతో నాకు వద్దు అంటూ కృష్ణ చెప్పినా వినకుండా తినమని చంద్రశేఖర్ బలవంతం చేస్తాడు. చికెన్ మంటకు పారిపోతుంది కృష్ణ. ఆ తర్వాత మురారి నేను రేపు ఊరెళ్తున్నా. మీరు మీ అమ్మాయి కూడా రావాలని చెప్తాడు. చికెన్‌లో కారం కావాలని వేసిందని మురారికి తెలిసిపోతుంది. ఆ తర్వాత సుందరి ఊరెళ్తానంటే డబ్బులిస్తాడు సీఐ. ఆ తర్వాత మనం కూడా ఏసీపీ వాళ్ల ఇంట్లో పెళ్లికి వెళ్తున్నామని కృష్ణకు చెప్తాడు చంద్రశేఖర్. నేను మాత్రం ఈ పెళ్లికి రానంటూ మారాం చేస్తుంది కృష్ణ. కూతురికి ఏవో మాటలు చెప్పి ఒప్పిస్తాడు చంద్రశేఖర్.
సీన్ కట్ చేస్తే.. ఏసీపీతో కలిసి చంద్రశేఖర్ కృష్ణలు ఊరికి బయల్దేరతారు. దాబాలో అందరూ కలిసి కాఫీ తాగుతారు. కారం కలిపిన చికెన్ కర్రీని తానే తినేలా చేసినందుకు కృష్ణ మురారి మీద రివేంజ్ తీర్చుకుంటుంది. ఎందుకు కాఫీలో ఉప్పు కలిపావ్ అని అడుగుతాడు మురారి. మా నాన్నకు ఇచ్చిన మాట ప్రకారం వీఆర్ఎస్ ఇవ్వమని అడుగుతుంది. వీఆర్ఎస్ ఎప్పుడు ఇవ్వాలో గవర్నమెంట్ చూసుకుంటుంది అంటాడు మురారి. మరి కృష్ణ ఏం చేయబోతుందో తరువాతి ఎపిసోడ్లో చూద్దాం..